Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

Published

on

BBMA POLICE E:NEWS // పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

🟥 BBMA POLICE E:NEWS //

పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

శ్రీకాకుళం జిల్లా మందస పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి గౌరవ పోక్సో కోర్టు జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మందస పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 169/2019 U/s 354-D, 506, 509 ఐపీసీ & సెక్షన్ 11 r/w 12 పోక్సో చట్టం–2012 కింద నమోదు చేసిన ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువైనట్లు కోర్టు తేల్చింది.

వివరాల్లోకి వెళ్తే, తేది 30-12-2019న మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో నిందితుడు కొర్రాయి తిరుపతి @ రెడ్డి, బాధితురాలిని గత రెండు సంవత్సరాలుగా అసభ్యంగా మాట్లాడటం, వెకిలి చేష్టలతో మానసికంగా వేధించడం, ఒక సందర్భంలో స్కూల్ నుండి వస్తుండగా ఆమె చేయి పట్టుకొని అసభ్యకరంగా మాట్లాడడం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తే విడిచిపెట్టనని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు అప్పటి మందస ఎస్‌.ఐ సి హెచ్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున జి.వి.ఎస్.యు. విశాలాక్షి వాదనలు వినిపించారు.

గౌరవ శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎన్. సునీత గారు, తేది 16-02-2026న నిందితుడికి ఒక సంవత్సరం సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా, అలాగే సెక్షన్ 506 ఐపీసీ కింద 6 నెలల జైలు శిక్ష విధించారు.

పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో జిల్లా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

POLICE E:NEWS BBMA// జోగిపేట సబ్ జైల్ ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులపై ఐజీ ఎం. శ్రీనివాస్ పరిశీలన

Published

on

By

POLICE E:NEWS BBMA// జోగిపేట సబ్ జైల్ ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులపై ఐజీ ఎం. శ్రీనివాస్ పరిశీలన

POLICE E:NEWS BBMA// జోగిపేట సబ్ జైల్ ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులపై ఐజీ ఎం. శ్రీనివాస్ పరిశీలన

జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా పరిధిలోని జోగిపేట సబ్ జైల్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను ఐజీ ఎం. శ్రీనివాస్ సందర్శించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి, నిర్మాణం వేగవంతంగా మరియు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగాలని సూచించారు. విదేశీయులు సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

నివాస వసతి, భద్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు వంటి అంశాల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్సిట్ హోంను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణ పనులలో పారదర్శకత మరియు నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, డీసీపీ కృష్ణ చైతన్య, డీఎస్పీ సత్తయ్య గౌడ్, జోగిపేట ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

Police News

POLICE NEWS BBMA// గండీడ్ KGBV పాఠశాలలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ – విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

Published

on

By

POLICE NEWS BBMA// గండీడ్ KGBV పాఠశాలలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ – విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

POLICE NEWS BBMA// గండీడ్ KGBV పాఠశాలలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ – విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

బుధవారం మహమ్మదాబాద్ మండలం గండీడ్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV) పాఠశాలలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య పరిస్థితులు, పాఠశాల మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించారు.

తరగతి గదుల్లో బోధన విధానాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది, భోజన ఏర్పాట్లు, శుభ్రత వంటి అంశాలను తనిఖీ చేసి, పోషకాహారం సరైన విధంగా అందుతున్నదా అనే విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు.

పాఠశాలలో మెరుగైన బోధన, సౌకర్యాలు, పరిశుభ్రత మరియు విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Continue Reading

Police News

POLICE NEWS BBMA// TCS నాసిక్ కేసులో సంచలన మలుపు – కార్పొరేట్ కుంభకోణం నుంచి జాతీయ భద్రత కోణం వరకు దర్యాప్తు

Published

on

By

POLICE NEWS BBMA// TCS నాసిక్ కేసులో సంచలన మలుపు – కార్పొరేట్ కుంభకోణం నుంచి జాతీయ భద్రత కోణం వరకు దర్యాప్తు

POLICE NEWS BBMA// TCS నాసిక్ కేసులో సంచలన మలుపు – కార్పొరేట్ కుంభకోణం నుంచి జాతీయ భద్రత కోణం వరకు దర్యాప్తు

నాసిక్‌లో వెలుగుచూసిన TCS సంబంధిత కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. ప్రారంభంలో కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్, బలవంతపు మత మార్పిడుల ఆరోపణలతో ప్రారంభమైన ఈ వ్యవహారం, ఇప్పుడు మరింత విస్తృత దర్యాప్తుకు దారితీసింది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ కేసులో కీలకంగా భావిస్తున్న హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్‌పై నిందితులను రక్షించడంలో పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, కొన్ని వర్గాలు ఈ కేసును ఇతర తీవ్ర నేరాలు లేదా నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారికంగా నిర్ధారించిన వివరాల మేరకే విచారణ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ఘటన కార్పొరేట్ సంస్థల్లో మహిళల భద్రత, పారదర్శక వ్యవస్థల అవసరంపై చర్చకు దారితీసింది. బాధితులకు న్యాయం చేయడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Continue Reading

Trending