Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

ఒక్క అవకాశం ఇస్తే 55వ డివిజన్ అభివృద్ధి చేసి చూపిస్తా : కర్క పద్మజ (సుజాత) శ్రీనివాస్

Published

on

•గత పాలకుడి నిర్లక్ష్యంతో అభివృద్ధి శూన్యం – ఒక్క అవకాశం ఇస్తే డివిజన్ రూపురేఖలు మారుస్తా : కర్క పద్మజ (సుజాత) శ్రీనివాస్

బిబిఎంఏ న్యూస్

గోదావరిఖని / ఫిబ్రవరి 09 :

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌లో గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ప్రజల సమస్యలను పట్టించుకునే నాయకత్వం లేక డివిజన్ వెనుకబడిపోయిందని 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కర్కపద్మజ (సుజాత) శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె, స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో గెలిచిన నాయకుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని, ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పనిని కూడా సక్రమంగా పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేస్తూ అభివృద్ధి పేరుతో మోసం చేశారని విమర్శించారు.

డివిజన్‌లో రోడ్లు దారుణ స్థితిలో ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. తాగునీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పారిశుధ్య నిర్వహణ లోపాల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వీధిదీపాలు సక్రమంగా పనిచేయక భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని, కాలనీల్లో కనీస మౌలిక వసతులకే ప్రజలు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, ముఖ్యంగా సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోందని పద్మజ అన్నారు. కార్మికుల సంక్షేమం పేరుతో మాటలకే పరిమితమై, ఆచరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చే నాయకులను ఈసారి ప్రజలే నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలుకాలేదో ప్రశ్నించాలని, అభివృద్ధి పనులకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేకపోయారో అడగాలని ప్రజలకు సూచించారు. పెత్తందారి రాజకీయాలకు ముగింపు పలికి, నిజంగా ప్రజల కోసం పని చేసే నాయకత్వాన్ని ఎన్నుకునే సమయం వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

తాను అధికార రాజకీయాలకు దూరంగా, ప్రజల మధ్య ఉండే వ్యక్తిగా, కుటుంబ సభ్యురాలిలా డివిజన్ అభివృద్ధి కోసం పని చేస్తానని కర్క పద్మజ (సుజాత) శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతానని, అవసరమైన నిధులు, పనుల మంజూరుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి సమస్యపై దృష్టి పెట్టుతానని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే 55వ డివిజన్ రూపురేఖలు మార్చి చూపిస్తానని ధీమా వ్యక్తం చేసిన పద్మజ, అభివృద్ధి అంటే ఏమిటో చేతల్లో చేసి చూపిస్తానని అన్నారు. ఈ ఎన్నికల్లో డివిజన్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందితే ప్రజాసేవకురాలిగా పని చేస్తానని మరోసారి హామీ ఇస్తూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

ఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

Published

on

మహబూబాబాద్ జిల్లా , నర్సింహులపేట, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో సహకరించిన మరో అధికారి యాకయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Continue Reading

Andhra

తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన

Published

on

తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.

 

చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.

 

ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Continue Reading

News

డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందిన భూమయ్యకు ఘన సన్మానం

Published

on

జగిత్యాల , జూన్ 11 (బీబీఎంఏ న్యూస్):

జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో గిరిదవర్‌గా విధులు నిర్వహిస్తున్న చిట్యాల భూమయ్య డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనను జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీమ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

 

కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ హకీమ్, నాయబ్ తహసీల్దార్, గిరిదవర్‌లు, రెవెన్యూ సిబ్బంది భూమయ్యకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా సహోద్యోగులు మాట్లాడుతూ, భూమయ్య తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ కార్యాలయానికి మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌గా కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Continue Reading

Trending