News
ప్రభుత్వ ఐటీఐలో న్యాయ అవగాహన సదస్సు
ప్రభుత్వ ఐటీఐ లో చట్ట అవగాహన సదస్సు.. ముఖ్య అతిథిగా అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి డా. టి. శ్రీనివాసరావు
బిబిఎంఏ న్యూస్ / గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో గోదావరిఖని మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు, చట్టపరమైన అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి, గోదావరిఖని డాక్టర్ టి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఐటీఐ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS)లోని ముఖ్య సెక్షన్లు, చట్టాలలో చోటు చేసుకున్న మార్పులు, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు.
యువత మత్తు మారక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరిస్తూ, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాల వినియోగం చట్టపరంగా శిక్షార్హమైన నేరమని స్పష్టం చేశారు.
అలాగే ఆధునిక సాంకేతిక విద్యా విధానంలో కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధి, నిరంతర అభ్యాసం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. చదువుపట్ల ఆసక్తి పెంపొందించుకోవడం, పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ద్వారా ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు.
ఆత్మవిశ్వాసం, స్పష్టమైన లక్ష్య నిర్ధారణ, లెర్నింగ్ స్కిల్స్, ఎర్నింగ్ స్కిల్స్, హెల్పింగ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, సమయ నిర్వహణ, ప్రతిభను గుర్తించుకోవడం, టార్గెట్ నిర్ణయం, నైతిక విలువలు, లా మోరల్స్ ప్రాముఖ్యతపై విద్యార్థులకు లోతైన మార్గనిర్దేశం చేశారు. విజయం–విఫలాలు జీవితంలో సహజమేనని, విఫలమైనా నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. మంచి కుటుంబ సంబంధాలు, తల్లిదండ్రుల గౌరవం, ఉపాధ్యాయుల పాత్ర విద్యార్థి జీవితంలో కీలకమని వివరించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం ఎస్ఐ సంధ్యా రాణి, కళాశాల ప్రిన్సిపాల్ ఈ. సురేందర్, విద్యాసాగర్ రెడ్డి, ప్యానల్ లాయర్ గుడికందుల భూమయ్య, కళాశాల లెక్చరర్లు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా ఐటీఐ విద్యార్థులకు చట్టపరమైన అవగాహనతో పాటు వ్యక్తిత్వ వికాసంపై స్పష్టత ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు.
News
మంథని ఆర్టీసీ బస్టాండ్‌లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
బిబిఎంఏ న్యూస్ /మంథని:
మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు అందిస్తున్న తాగునీటి సౌకర్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల వరకు బస్టాండ్‌లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడం, తాగునీటి సౌకర్యం లేకపోవడం వంటి అంశాలపై పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు తాత్కాలికంగా తాగునీటి ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అయితే, ప్రస్తుతం ఏర్పాటు చేసిన నీటి వ్యవస్థ పరిశుభ్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్టాండ్ పక్కన ఉన్న బోరు నీటిని పైపుల ద్వారా పైభాగంలోని వాటర్ ట్యాంక్‌కు అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ ట్యాంక్ పూర్తిగా చెత్త, ధూళితో నిండిపోయి ఉండటంతో పాటు ఎలాంటి మూత లేకపోవడం వల్ల కోతులు సైతం అందులోకి చేరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ నీటినే ప్రయాణికులకు తాగునీటిగా అందించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది మాత్రం తమకు మినరల్ వాటర్ తెప్పించుకొని వినియోగిస్తున్నారని, ప్రయాణికులను మాత్రం ఆరోగ్యానికి హానికరమైన నీటికి పరిమితం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కలుషిత నీటితో డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే పరిశుభ్రమైన తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Andhra
కేరళలో కొట్టియూర్ మహాదేవ ఆలయం
స్వయంభూ శివలింగం ఉన్న అపురూప పుణ్యక్షేత్రం…
కొట్టియూర్ మహాదేవ ఆలయం – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయం కలిసిన అపూర్వ పుణ్యక్షేత్రం
బిబిఎంఏన్యూస్ (ప్రత్యేక కథనం)
కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లాలోని సాంద్రమైన అటవీ ప్రాంతంలో, బావలి నది తీరాన నెలకొన్న కొట్టియూర్ మహాదేవ ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతన మరియు పుణ్యమైన శైవక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సహజసిద్ధమైన అడవుల మధ్య, నిర్మాణ వైభవానికి దూరంగా, ప్రకృతిని దేవాలయంగా భావించే అరుదైన సంప్రదాయం ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
ఈ ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు; ఇది పురాణాల, విశ్వాసాల మరియు సహజ జీవన విధానాల సమ్మేళనం. దక్ష యాగం, సతీదేవి ఆత్మార్పణ వంటి పౌరాణిక ఘటనలతో అనుసంధానమై ఉండటంతో ఈ క్షేత్రాన్ని భక్తులు తరచుగా “దక్షిణ వారణాసి”గా పిలుస్తారు. శివతత్వాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చేసే శక్తిక్షేత్రంగా ఇది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈ ఆలయ సముదాయం మరో విశిష్టత ఏమిటంటే, ఇది రెండు భాగాలుగా విభజించబడింది. నదికి ఒకవైపు ఏడాది పొడవునా దర్శనమిచ్చే ఇక్కరె కొట్టియూర్, మరోవైపు కేవలం వార్షిక ఉత్సవ సమయంలో మాత్రమే తెరుచుకునే అక్కరె కొట్టియూర్. ఈ తాత్కాలిక ఆలయం ప్రతీ సంవత్సరం ప్రకృతిలోనే నిర్మించబడటం, పండుగ అనంతరం పూర్తిగా తొలగించబడటం ఈ క్షేత్రాన్ని ప్రపంచంలోనే అరుదైన ఆధ్యాత్మిక సంప్రదాయంగా నిలబెడుతుంది.
28 రోజుల పాటు జరిగే వార్షిక వైశాఖ మహోత్సవం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. 2026 మే 29 నుండి జూన్ 24 వరకు జరగనున్న ఈ ఉత్సవం ప్రాచీన వేద యజ్ఞ సంప్రదాయాన్ని జీవంగా ప్రతిబింబిస్తుంది. నెయ్యట్టం ద్వారా ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో, భక్తులు లేత కొబ్బరికాయలతో ఏలనీరట్టం వంటి పవిత్ర ఆచారాల్లో పాల్గొంటారు. ప్రతి ఆచారం శుద్ధి, సమర్పణ, భక్తి అనే మూడు ప్రధాన భావాలను ప్రతిబింబిస్తుంది.
మణితార అనే నదీ రాళ్లపై స్వయంభూ శివలింగం వెలసి ఉండటం ఈ ఆలయానికి మరింత పవిత్రతను కలిగిస్తుంది. ప్రకృతి మధ్య, మానవ నిర్మిత గోడలు లేకుండా జరిగే పూజా విధానాలు భక్తులకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి.
సందర్శన పరంగా చూస్తే, కన్నూర్ తలస్సేరి రైల్వే స్టేషన్లు సమీపంలో ఉండగా, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ క్షేత్రానికి ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంది. వర్షాకాలంలో జరిగే ఈ ఉత్సవానికి భారీగా భక్తులు హాజరవుతారు కాబట్టి ముందస్తు ప్రణాళిక, వర్షపు రక్షణ చర్యలు, దీర్ఘ క్యూలకు సిద్ధంగా ఉండటం అవసరం.
ఆధ్యాత్మికతను ప్రకృతితో కలిపే అరుదైన సంప్రదాయం, పురాణాలను జీవంతం చేసే పూజా విధానం, భక్తి భావాన్ని శుద్ధ రూపంలో చూపించే విశిష్టత ఈ అన్ని కారణాల వల్ల కొట్టియూర్ మహాదేవ ఆలయం భారతీయ పుణ్యక్షేత్రాల్లో ఒక అపూర్వ స్థానం సంపాదించింది.
News
బసంత్ నగర్ చెకపోస్ట్ ను సీపీ ఆకస్మిక తనిఖీ
బక్రీద్ నేపథ్యంలో బసంత్ నగర్ టోల్ గేట్ చెక్‌పోస్ట్‌ను అర్ధరాత్రి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
బిబిఎంఏ న్యూస్ / బసంత్ నగర్ మే21
బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో అర్ధరాత్రి బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అంబర్ కిషోర్ ఝా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల తరలింపు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
పండుగల సమయంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని కమిషనర్ తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద అంశాలపై సమాచారం అందించాలని ఆయన కోరారు.
-
crime2 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News1 week agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
News4 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
Telangana18 hours agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment2 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime1 week agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
