Telangana
జర్నలిస్ట్ గా పేరు… కార్పొరేటర్‌గా ఆశయం: రాం అశోక్
జర్నలిస్ట్ గా పేరు… కార్పొరేటర్‌గా ఆశయం: రాం అశోక్
బిబిఎంఏ న్యూస్/గోదావరిఖని
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చి, అధికారుల దృష్టికి చేర్చి పరిష్కార దిశగా అడుగులు వేయించడంలో ‘నిరుద్యోగి న్యూస్ ఛానల్’ విశేష పాత్ర పోషించింది. ఆ ఛానల్ ద్వారా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన విద్యావంతుడు జర్నలిస్ట్ రాం అశోక్ ఇప్పుడు ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా తీసుకుని కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా రాం అశోక్ మాట్లాడుతూ, జర్నలిస్టుగా ప్రజా సమస్యలను చూపించడం వరకే పరిమితమయ్యానని, ఇకపై ప్రజాప్రతినిధిగా మారి వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించాలన్న సంకల్పంతో ముందుకు వస్తున్నానని తెలిపారు.
తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. “ఒక్క అవకాశం ఇవ్వండి… కార్పొరేటర్‌గా గెలిపించండి” అంటూ ప్రజలను కోరారు. స్థానికంగా ఆయనకు మద్దతు పెరుగుతున్నట్లు సమాచారం.
Telangana
బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శనతో విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన
బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శనతో విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన
మంథని, (బిబిఎంఏ న్యూస్) మార్చి 28:
జడ్పీహెచ్ఎస్ ఏక్లాస్పూర్ పాఠశాల విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా బసంత్ నగర్‌లోని కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో సిమెంట్ తయారీకి ఉపయోగించే ఐరన్, జిప్సం వంటి రా మెటీరియల్స్ క్రషింగ్ విధానం, బొగ్గుతో హీటింగ్ ప్రక్రియ, తుది సిమెంట్ తయారీ దశలను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే సిమెంట్ బ్యాగుల నింపడం, గూడ్స్ రైళ్లలో లోడింగ్ చేసే ఆటోమేటిక్ విధానాన్ని కూడా అవగాహన చేసుకున్నారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు సిమెంట్ తయారీపై ప్రాయోగిక జ్ఞానం సంపాదించారు. హెడ్ మాస్టర్ జి. జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంతోష్, డాక్టర్. దొమ్మటి రవి, సుచిత్ర రాజశేఖర్, అన్నం శ్రీనివాస్, మంజుల, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
End
Telangana
భద్రాచలం వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు..
భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
బీబీఎంఏ న్యూస్ / భద్రాచలం / మార్చి 28:
శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వేదికగా మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాచలం పట్టణం అంతా రామనామ స్మరణతో మార్మోగింది.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
india
మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
13 మంది సజీవదహనం 🔥
బీబీఎంఏ న్యూస్ / మార్కాపురం
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది సజీవదహనమయ్యారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాయవరం సమీపంలోని క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. కొందరు కిటికీలు పగులగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకున్న 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
Telangana2 weeks agoరాష్ట్రస్థాయి గౌరవం అందుకున్న కవి శ్రీపతి రాము
-
Telangana2 weeks agoమంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి
-
Telangana2 weeks agoఘనంగా రిమ్ జిమ్ కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం
-
Telangana2 weeks agoఉప్పల్‌లో హత్య కేసు ఛేదన… 6 గంటల్లో ఇద్దరు నిందితులు అరెస్ట్
-
Telangana2 weeks agoత్వరలో డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి ప్రకటన
-
india6 days agoమార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
-
News7 days agoకాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన టి. జీవన్ రెడ్డి
-
Politics4 days agoBBMA POLICE E:NEWS// నెల్లూరు చిల్లకూరులో టీడీపీ నాయకుల రాసలీలలు కలకలం!!
