Police News
శ్రీకాకుళం ఆలయ చోరీ కేసు ఘన విజయం
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
ll శ్రీ విజయ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసు ఛేదన ll.
ll సుమారు రూ.40.25 లక్షల విలువైన కేసు ప్రాపర్టీ పూర్తిస్థాయిలో రికవరీ ll.
ll నేరం జరిగిన వారం రోజుల్లోనే 5 మంది నిందితుల అరెస్ట్ll.
ll కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ll.
శ్రీ విజయ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం (చిన్న తిరుపతి), కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో చోరీకి గురైన సుమారు రూ.40.25 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు మరియు హుండీలోని నగదును పూర్తిస్థాయిలో రికవరీ చేసి, నిందితులను కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వెల్లడించారు.
కేసు దర్యాప్తులో భాగంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, నరసన్నపేట పోలీస్ స్టేషన్ మరియు మన్యం జిల్లా బత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొత్తం నాలుగు కేసులను విజయవంతంగా ఛేదించి, ఆయా కేసులకు సంబంధించిన కేసు ప్రాపర్టీని పూర్తిస్థాయిలో రికవరీ చేసినట్లు తెలిపారు.
🔹 కేసు వివరాలు: కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం: 08/2026 , 6½ తులాల బంగారు ఆభరణాలు,15 కేజీల వెండి ఆభరణాలు,నగదు సుమారు ₹80,000/-. దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అంశములు.వెంకటేశ్వర ఆలయంలో దొంగతనం జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నరసన్నపేట పోలీస్ స్టేషన్
క్రైమ్ నెం: 09/2026 – నగదు ₹ 2,000/- రికవరీ
క్రైమ్ నెం: 10/2026 3 గ్రాముల బంగారం రికవరీ
🔹 నిందితుల వివరాలు:
A.1: కురమాన శ్రీనివాసరావు @ శ్రీను @ నాని,తండ్రి: సింహాచలం | వయస్సు: 25 సం. | కులం: ఎస్సీ (మాల)గ్రామం: గొట్టిపల్లి, ఎల్.ఎన్ పేట మండలం.
A.2: సవర బొగేష్ తండ్రి: మంగయ్య | వయస్సు: 26 సం. | కులం: ఎస్టీ (సవర)
గ్రామం: కారిగూడ, ఎల్.ఎన్ పేట మండలం.
A.3: సవర సుదర్శన్ రావు @ సిద్ధుతండ్రి: భోగన్న | వయస్సు: 25 సం. | కులం: ఎస్టీ (సవర) గ్రామం: మెట్టుగూడ, ఎల్.ఎన్ పేట మండలం.
A.4: పుల్లేటిగుర్తి చక్రధర్
తండ్రి: బెనర్జీ | వయస్సు: 37 సం. | కులం: విశ్వబ్రాహ్మణ గ్రామం & మండలం: హిరమండలం.
A.5: దార రమేష్ కుమార్,తండ్రి: లేట్ అప్పలస్వామి | వయస్సు: 36 సం. | కులం: ఎస్సీ (మాల) గ్రామం: గొట్టిపల్లి, ఎల్.ఎన్ పేట మండలం.
🔹 నేర విధానం:
A.1ముద్దాయి ఆధ్వర్యంలో A.2,A.3 లు కలిసి తేదీ 03.01.2026న ఆలయాన్ని రెక్కీ చేసి, 09.01.2026 రాత్రి అక్రమంగా ఆలయంలోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు మరియు నగదును దొంగిలించారు. దొంగిలించిన వస్తువులను A.4 సమన్వయం, సహాయంతో A.5కు అప్పగించారు.
నిందితులు గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రసిద్ధ ఆలయాలను పరిశీలించి, ఆలయ ఫోటోల ఆధారంగా విలువైన ఆభరణాలను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల DVR బాక్స్‌ను తొలగించి చెరువులో పడవేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కిటికీ మెష్‌ను తొలగించి లోపలికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అనంతరం DVR బాక్స్‌ను కూడా పోలీసులు రికవరీ చేశారు.
🔹 గత నేర చరిత్ర:
A.1: 38 చోరీ కేసులు – అన్ని కేసుల్లో జైలుకు వెళ్ళినారు.
A.2: 10 చోరీ కేసులు – అన్ని కేసుల్లో జైలుకు వెళ్ళినారు.
A.3: 7 చోరీ కేసులు – అన్ని కేసుల్లో జైలుకు వెళ్ళినారు.
🔹 ప్రతిభకు ప్రశంస:
జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి,ఐపీఎస్ గారి మార్గదర్శకత్వంలో కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీస్ అధికారి షేక్ సహాబాజ్ అహ్మద్, కాశీబుగ్గ ఇన్‌స్పెక్టర్ ఎన్ని రామకృష్ణ సమర్థవంతంగా కేసును ఛేదించారు.ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ ఆర్.నరసింహమూర్తి, బి. గవరయ్య (HC 1137), ఎస్. ఉషాకిరణ్ (PC 2058),ఎం. నీలకంఠం (PC 2139), జి. షణ్ముఖరావు (PC 661), సీహెచ్. వి. సత్యం (HC 1352 – IT CORE) గారిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
🔹 భద్రతపై సూచనలు:
ఆలయాల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరచాలని జిల్లా ఎస్పీ సూచించారు. DVR బాక్స్‌ను బలమైన గదిలో ఏర్పాటు చేసి, మొబైల్ ఫోన్‌లకు అనుసంధానం చేసే విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు మీడియా ద్వారా జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈ పత్రిక సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ కేవీ రమణ, కాశీబుగ్గ డిఎస్పి షేక్ సాహబాజ్ ఆహమ్మద్,ఇన్స్పెక్టర్లు ఇమాన్యుల్ రాజు,రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి పోలీస్ సిబ్బంది ఉన్నారు.
#SrikakulamPolice #CaseSolved #TempleTheft #SmartPolicing #PublicSafety
@APPOLICE100
Police News
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
ଓଡ଼ିଶା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ଗ୍ରାମୀଣ ଥାନା ପୋଲିସ ଏକ ବଡ଼ ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟକୁ ଠାବ କରିଛି। ଝାଡ଼ଖଣ୍ଡକୁ ଚୋରାଚାଲାନ ହେଉଥିବା ୧୩୧.୩୪୦ କିଲୋଗ୍ରାମ ଗଞ୍ଜେଇ ଜବତ କରାଯାଇଛି। ଅଭିଯାନ ସମୟରେ ଗଞ୍ଜେଇ ପରିବହନରେ ବ୍ୟବହୃତ ଏକ କାର, ତିନୋଟି ନମ୍ବର ପ୍ଲେଟ୍ ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ଆପତ୍ତିଜନକ ସାମଗ୍ରୀ ମଧ୍ୟ ଜବତ ହୋଇଛି। ଏହି ଘଟଣାରେ ଦୁଇଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରାଯାଇ PS କେସ୍ ନଂ 135/26 ଅନୁଯାୟୀ ଅଦାଲତକୁ ପଠାଯାଇଛି। ନିଶାଦ୍ରବ୍ୟ ବିରୋଧୀ ଅଭିଯାନ ଜାରି ରହିବ ବୋଲି ପୋଲିସ ସୂଚନା ଦେଇଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
ରାୟଗଡା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ରାୟଗଡା ପୋଲିସ ଡିଭିଏଫ (DVF) ଓ ଏସଓଜି (SOG) ଦଳ ସହ ମିଳି ଅମ୍ବାଦୋଳା ଥାନା ଅନ୍ତର୍ଗତ ଧେପାଗୁର୍ହା ସଂରକ୍ଷିତ ଜଙ୍ଗଲ ଅଞ୍ଚଳରେ ଏକ ବିଶେଷ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଚଳାଇଥିଲେ। ଅଭିଯାନ ସମୟରେ ଜଙ୍ଗଲ ଭିତରେ ଲୁଚାଇ ରଖାଯାଇଥିବା ଏକ ମାଓବାଦୀ ଡମ୍ପକୁ ଠାବ କରାଯାଇ ଉଦ୍ଧାର କରାଯାଇଛି। ଏହି ସଫଳ ଅଭିଯାନ ମାଧ୍ୟମରେ ମାଓବାଦୀ କାର୍ଯ୍ୟକଳାପକୁ ରୋକିବା ସହ ଅଞ୍ଚଳର ସୁରକ୍ଷା ବ୍ୟବସ୍ଥାକୁ ଆହୁରି ସୁଦୃଢ଼ କରାଯାଇଛି। ପୋଲିସ ପକ୍ଷରୁ ଅଞ୍ଚଳରେ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଓ ନଜରଦାରି ଜାରି ରହିଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
ରାଉରକେଲା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ସୂଚନା ଆଧାରରେ ସେକ୍ଟର-୩ ଥାନାର ରାତ୍ରିକାଳୀନ ପେଟ୍ରୋଲିଂ ଟିମ୍ ଏସଆଇ ଆର. କେ. ଭୁଏଙ୍କ ନେତୃତ୍ୱରେ ସେକ୍ଟର-୨ ର ଡିସୁଜା ସ୍କୁଲ ପଛପଟେ ଡକାୟତି ପାଇଁ ଯୋଜନା କରୁଥିବା ୫ ଜଣ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀଙ୍କୁ ଗିରଫ କରିଛନ୍ତି। ଅଭିଯୁକ୍ତମାନଙ୍କ ନିକଟରୁ ତଳୱାର, କଟର, ଛୁରୀ, କୁରାଡ଼ି, ଲୁହା ରଡ଼, ସ୍କ୍ରୁ ଡ୍ରାଇଭର, ହାତୁଡ଼ି, ଲଙ୍କା ଗୁଣ୍ଡ, ଟର୍ଚ୍ଚ, ମାସ୍କ, ମୋବାଇଲ ଫୋନ ସହ ବିଭିନ୍ନ ସାମଗ୍ରୀ ଜବତ କରାଯାଇଛି। ପୋଲିସର ତ୍ୱରିତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଫଳରେ ଏକ ବଡ଼ ଅପରାଧ ଟଳିଯାଇଛି। ସମସ୍ତ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ କୋର୍ଟକୁ ପଠାଯାଇଛି।
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News3 weeks agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB3 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News4 weeks agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
-
News2 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News4 weeks agoదొంగల ముఠా సంచారం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధర్మారం పోలీసుల హెచ్చరిక..
-
News2 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
Andhra4 weeks agoప్రభుత్వ వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన నిమ్స్..
