Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

తక్కల్లపల్లి బాబురావు ఎన్నికపై పరకాల ప్రజల హర్షం

Published

on

తక్కల్లపల్లి బాబురావు ఎన్నికపై పైడిపల్లి పరకాల ప్రజల హర్షం

బిబిఎంఏ న్యూస్ / హనుమకొండ

పరకాల నివాసి తక్కల్లపల్లి బాబురావు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా, హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికతో ప్రజలకు న్యాయపరమైన సలహాలు అందించడం, న్యాయ సమస్యల పరిష్కారంలో అండగా నిలిచే అవకాశం మరింత బలపడిందని గ్రామస్తులు పేర్కొన్నారు.

అలాగే తక్కల్లపల్లి బాబురావు హనుమకొండ జిల్లా సీపీఐ జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందకరమని తెలిపారు. రెండు కీలక పదవులను చేపట్టి ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి, పట్టుదలతో ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు.

ఈ సందర్భంగా బొజ్జం అన్వేశ్వరిపరమేశ్‌తో పాటు పైడిపల్లి గ్రామ ప్రజలందరూ తక్కల్లపల్లి బాబురావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనను ఈ పదవికి ఎన్నిక చేసిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

ఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

Published

on

మహబూబాబాద్ జిల్లా , నర్సింహులపేట, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో సహకరించిన మరో అధికారి యాకయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Continue Reading

Andhra

తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన

Published

on

తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.

 

చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.

 

ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Continue Reading

News

డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందిన భూమయ్యకు ఘన సన్మానం

Published

on

జగిత్యాల , జూన్ 11 (బీబీఎంఏ న్యూస్):

జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో గిరిదవర్‌గా విధులు నిర్వహిస్తున్న చిట్యాల భూమయ్య డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనను జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీమ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

 

కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ హకీమ్, నాయబ్ తహసీల్దార్, గిరిదవర్‌లు, రెవెన్యూ సిబ్బంది భూమయ్యకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా సహోద్యోగులు మాట్లాడుతూ, భూమయ్య తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ కార్యాలయానికి మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌గా కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Continue Reading

Trending