Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

నేడే తుది పోరు.. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Published

on

నేడే తుది పోరు..

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

3752 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్

ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్

మధ్యాహ్నం తరువాత లెక్కింపు

సర్వం సిద్ధం చేసిన అధికారులు

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

బిబిఎంఏ న్యూస్/ హైదరాబాద్

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ప్రశాంతంగా పూర్తవ్వగా, మూడో విడతకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ విడతలో మొత్తం 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 4,157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా,

అందులో 394 గ్రామాలు, 7,916 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఈ తుది విడత పోరులో మొత్తం 3,752 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 12,640 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అలాగే, 28,406 వార్డులకు గాను 75,283 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఇవాళ రాత్రికి ఫలితాలు పూర్తిగా వెలువడుతాయి. కాగా, 11 గ్రామాలకు, 112 వార్డులకు మాత్రం వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు.

 

ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రిని మంగళవారం ఉదయం నుంచే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి తీసుకుని పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా నిఘా ఉంచారు. ఈ మూడో విడత ఎన్నికలతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి రెండు విడతల్లో బీసీలకు చెందిన అభ్యర్థులు గణనీయమైన విజయాలను నమోదు చేసి తమ సత్తాను నిరూపించుకున్నారు. బీసీ అభ్యర్థులు, వారి మద్దతుదారులు తమ బలాన్ని ప్రదర్శించడంలో విజయం సాధిం చడంతో, నేడు జరగనున్న మూడో విడత పోరుపై మరింత ఉత్కంఠ నెలకొంది. తొలి విడతల్లో లభించిన విజయోత్సాహంతో, ఈ తుది దశ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు బీసీ అభ్యర్థులు రెడీ అయితున్నారు. రెండు విడతల ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని, ఈ చివరి దశలో కూడా విజయం సాధించి, గ్రామ పాలన పగ్గాలు చేపట్టేందుకు బీసీ అభ్యర్థులు సర్వసన్నద్ధమయితున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

ఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

Published

on

మహబూబాబాద్ జిల్లా , నర్సింహులపేట, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ వ్యవహారంలో సహకరించిన మరో అధికారి యాకయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Continue Reading

Andhra

తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన

Published

on

తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.

 

చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.

 

ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Continue Reading

News

డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందిన భూమయ్యకు ఘన సన్మానం

Published

on

జగిత్యాల , జూన్ 11 (బీబీఎంఏ న్యూస్):

జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో గిరిదవర్‌గా విధులు నిర్వహిస్తున్న చిట్యాల భూమయ్య డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనను జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీమ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

 

కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ హకీమ్, నాయబ్ తహసీల్దార్, గిరిదవర్‌లు, రెవెన్యూ సిబ్బంది భూమయ్యకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా సహోద్యోగులు మాట్లాడుతూ, భూమయ్య తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ కార్యాలయానికి మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌గా కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Continue Reading

Trending