Police News
అభ్యుదయం సైకిల్ యాత్ర: మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రజలలో అవగాహన పెంపు
*శ్రీకాకుళం జిల్లా పోలీస్. పత్రిక ప్రకటన. శ్రీకాకుళం, డిసెంబరు 16:*
🛑 *“అభ్యుదయం సైకిల్ యాత్ర – Pedal for a Drug-Free Future”*
🛑 “అభ్యుదయం సైకిల్ యాత్ర” ద్వారా పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు – మాదకద్రవ్యాల నిర్మూలన కొరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసులు.
🛑 గంజాయి, మత్తు పదార్థాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా కొనసాగుతున్న
🛑 “ *మాదకద్రవ్యాలు వద్దు (“SAY NO TO DRUGS”) – గంజాయి అక్రమ రవాణాను నిరోధిద్దాం*
గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రారంభించిన “అభ్యుదయం సైకిల్ యాత్ర” (పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు) విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ గారు మాదకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రారంభమైన “అభ్యుదయం సైకిల్ ర్యాలీ” విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా విజయవంతంగా సాగి నేడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణంలోకి చేరుకొనగా స్థానిక రామలక్ష్మణ జంక్షన్ వద్ద ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నం రేంజ్ డీఐజి శ్రీ గోపి నాథ్ జట్టి గారు, ప్రభుత్వ అధికారులు, ప్రత్యేక అహ్వనితులు అయిన ప్రజా ప్రతినిధులు అభ్యుదయ సైకిల్ యాత్ర బృందం సభ్యులను సాదరంగా ఆహ్వానించి, హృదయపూర్వక స్వాగతం పలికి సైకిల్ యాత్ర ను లాంఛనగా ప్రారంభించారు. ఈ యాత్ర రామలక్ష్మణ జంక్షన్ వద్ద ప్రారంభమై సూర్యామహల్, జీ టి రోడ్డు, సెవెన్ రోడ్డు జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలోకి ప్రవేశించిన అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్ద కు చేరుకుంది. సభ వద్ద ఏర్పాటుచేసిన వివిధ శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ ను ముఖ్య అతిథిలు ప్రారంభించి తిలకించారు. విద్యార్థుల ఫ్లాష్‌మాబ్ , జానపద నృత్య కళా తప్పిటిగుళ్ళు, విద్యార్థులు చేసిన స్క్రిప్ట్ లు ఆకర్షణగా నిలిచాయి. స్థానిక ప్రజలు, విద్యార్థులు , ప్రవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, కార్మికులు , ప్రజా ప్రతినిధులు అడుగడుగునా ర్యాలీకి హర్షధ్వానాలు చేశారు. విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించి, “మాదకద్రవ్యాలు వద్దు – జీవితమే ముద్దు” అంటూ ఆకట్టుకున్నారు
ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు మాట్లాడుతూ,
మంచి సమాజ నిర్మాణం మంచి వ్యక్తుల వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ క్రమంలో గత ఏడాది కాలంలో రేంజ్ పరిధిలో సంకల్పం మిషన్, కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమం లో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు గురించి వివరించారు. గంజాయి నిర్మూలనకు కొత్త కోణంలో చేపట్టిన “అభ్యుదయం సైకిల్ యాత్ర” ను గత నెల నవంబర్ 12వ తేదీన పాయకరావుపేటలో రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు ప్రారంభించారని, నేటికి 35 రోజులుగా విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ యాత్ర విజయానికి పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల సమన్వయం కీలక పాత్ర పోషించిందన్నారు. సుమారు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ముఖ్య పట్టణాలు, గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని, ముఖ్యంగా యువత డ్రగ్స్ వాడకం వలన కలిగే నష్టాలను తెలుసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, ప్రతి కళాశాలలో సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ అందిస్తున్నామని తెలిపారు. ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమం ఈ నెల 29వ తేదీన ఇచ్చాపురంలో భారీ అవగాహన కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ, విశాఖపట్నం రేంజ్ పరిధిలో పాయకరావుపేటలో రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, రేంజ్ డీఐజీ గారు ప్రారంభించిన ఈ సైకిల్ యాత్ర నెలరోజుల పాటు కొనసాగి జిల్లాకు చేరుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం గంజాయి నిర్మూలనతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో డ్రగ్స్‌పై సరైన అవగాహన కలగాలని అన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని 1972, 112 నంబర్లకు లేదా స్థానిక పోలీసులకు అందించాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొనిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు అయిన కూన రవికుమార్, గుండు శంకర్, బొగ్గు రమణమూర్తి గారు, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
@APPOLICE100
Police News
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
ଓଡ଼ିଶା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ଗ୍ରାମୀଣ ଥାନା ପୋଲିସ ଏକ ବଡ଼ ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟକୁ ଠାବ କରିଛି। ଝାଡ଼ଖଣ୍ଡକୁ ଚୋରାଚାଲାନ ହେଉଥିବା ୧୩୧.୩୪୦ କିଲୋଗ୍ରାମ ଗଞ୍ଜେଇ ଜବତ କରାଯାଇଛି। ଅଭିଯାନ ସମୟରେ ଗଞ୍ଜେଇ ପରିବହନରେ ବ୍ୟବହୃତ ଏକ କାର, ତିନୋଟି ନମ୍ବର ପ୍ଲେଟ୍ ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ଆପତ୍ତିଜନକ ସାମଗ୍ରୀ ମଧ୍ୟ ଜବତ ହୋଇଛି। ଏହି ଘଟଣାରେ ଦୁଇଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରାଯାଇ PS କେସ୍ ନଂ 135/26 ଅନୁଯାୟୀ ଅଦାଲତକୁ ପଠାଯାଇଛି। ନିଶାଦ୍ରବ୍ୟ ବିରୋଧୀ ଅଭିଯାନ ଜାରି ରହିବ ବୋଲି ପୋଲିସ ସୂଚନା ଦେଇଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
ରାୟଗଡା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ରାୟଗଡା ପୋଲିସ ଡିଭିଏଫ (DVF) ଓ ଏସଓଜି (SOG) ଦଳ ସହ ମିଳି ଅମ୍ବାଦୋଳା ଥାନା ଅନ୍ତର୍ଗତ ଧେପାଗୁର୍ହା ସଂରକ୍ଷିତ ଜଙ୍ଗଲ ଅଞ୍ଚଳରେ ଏକ ବିଶେଷ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଚଳାଇଥିଲେ। ଅଭିଯାନ ସମୟରେ ଜଙ୍ଗଲ ଭିତରେ ଲୁଚାଇ ରଖାଯାଇଥିବା ଏକ ମାଓବାଦୀ ଡମ୍ପକୁ ଠାବ କରାଯାଇ ଉଦ୍ଧାର କରାଯାଇଛି। ଏହି ସଫଳ ଅଭିଯାନ ମାଧ୍ୟମରେ ମାଓବାଦୀ କାର୍ଯ୍ୟକଳାପକୁ ରୋକିବା ସହ ଅଞ୍ଚଳର ସୁରକ୍ଷା ବ୍ୟବସ୍ଥାକୁ ଆହୁରି ସୁଦୃଢ଼ କରାଯାଇଛି। ପୋଲିସ ପକ୍ଷରୁ ଅଞ୍ଚଳରେ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଓ ନଜରଦାରି ଜାରି ରହିଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
ରାଉରକେଲା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ସୂଚନା ଆଧାରରେ ସେକ୍ଟର-୩ ଥାନାର ରାତ୍ରିକାଳୀନ ପେଟ୍ରୋଲିଂ ଟିମ୍ ଏସଆଇ ଆର. କେ. ଭୁଏଙ୍କ ନେତୃତ୍ୱରେ ସେକ୍ଟର-୨ ର ଡିସୁଜା ସ୍କୁଲ ପଛପଟେ ଡକାୟତି ପାଇଁ ଯୋଜନା କରୁଥିବା ୫ ଜଣ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀଙ୍କୁ ଗିରଫ କରିଛନ୍ତି। ଅଭିଯୁକ୍ତମାନଙ୍କ ନିକଟରୁ ତଳୱାର, କଟର, ଛୁରୀ, କୁରାଡ଼ି, ଲୁହା ରଡ଼, ସ୍କ୍ରୁ ଡ୍ରାଇଭର, ହାତୁଡ଼ି, ଲଙ୍କା ଗୁଣ୍ଡ, ଟର୍ଚ୍ଚ, ମାସ୍କ, ମୋବାଇଲ ଫୋନ ସହ ବିଭିନ୍ନ ସାମଗ୍ରୀ ଜବତ କରାଯାଇଛି। ପୋଲିସର ତ୍ୱରିତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଫଳରେ ଏକ ବଡ଼ ଅପରାଧ ଟଳିଯାଇଛି। ସମସ୍ତ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ କୋର୍ଟକୁ ପଠାଯାଇଛି।
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News4 weeks agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB3 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News4 weeks agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
-
News2 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News4 weeks agoదొంగల ముఠా సంచారం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధర్మారం పోలీసుల హెచ్చరిక..
-
News2 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
Andhra4 weeks agoప్రభుత్వ వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన నిమ్స్..
