Telangana
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలను పర్యవేక్షిస్తున్న సిపి అంబర్ కిషోర్ ఝా
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలను పర్యవేక్షిస్తున్న సిపి అంబర్ కిషోర్ జా
బీబీఎంఏ న్యూస్ / రామగుండం, నవంబర్ 22:
రోడ్డు ప్రమాద రహిత ప్రాంతం లక్ష్యంగా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి పోలీసులు విస్తృత చర్యలు ప్రారంభించామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. మంచిర్యాల జోన్‌లోని వేంపల్లి ముల్కల బ్రిడ్జ్, గుడిపేట బ్రిడ్జ్ సహా ప్రమాదాలు జరిగిన ప్రధాన బ్లాక్ స్పాట్‌లను ఆయనే స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో కలిసి సాంకేతిక లోపాలను గుర్తించారు.
బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, అవసరమైన లైటింగ్, వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాంగ్ రూట్ ప్రయాణాలను అరికట్టేందుకు ప్రత్యేక పహారా, నియంత్రణ చర్యలను చేపట్టాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ కమిటీలను బలోపేతం చేసి, ప్రతి శాఖతో సమన్వయం చేస్తూ ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.
అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం కుటుంబాలను దెబ్బతీస్తున్నాయని హెచ్చరించిన సీపీ, విద్యార్థులు సహా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. చలికాలంలో మంచు కారణంగా రహదారులు స్పష్టంగా కనిపించకపోవడంతో జాగ్రత్తగా, నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు. ప్రధాన రహదారులపై నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐ అశోక్ కుమార్, రోడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
crime
అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
బిబిఎంఏ న్యూస్: పెద్దపల్లి( ఓదెల)
అత్యాచార కేసులో నేరం రుజువుకావడంతో ఓదెల మండలానికి చెందిన మాచర్ల అలియాస్ రాచర్ల రాయమల్లుకు పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధించింది.
2024 ఏప్రిల్ 23న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోత్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. కేసులో సమర్థంగా వాదనలు వినిపించిన పీపీ డొంకెన రవీందర్‌తో పాటు దర్యాప్తు అధికారులను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
News
సూరయ్యపల్లి బొడ్రాయి ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
సూరయ్యపల్లిలో భక్తిశ్రద్ధల మధ్య భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి స్థిర ప్రతిష్ట లో పాల్గొని
ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, బిబిఎంఎ న్యూస్, మే 09:
మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామంలో నిర్వహించిన భూలక్ష్మి, మహాలక్ష్మి సహిత బొడ్రాయి స్థిర ప్రతిష్ట మరియు పోచమ్మ కొలుపు కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామ దేవతల ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని మంత్రి ప్రార్థించారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సంప్రదాయాలు, గ్రామ దేవతల పూజలు మన సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రికి ఘన స్వాగతం పలికారు. మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తుల సందడి ఆకట్టుకుంది.
గ్రామ దేవతల పూజలతో గ్రామానికి శాంతి, సుభిక్షం, ఐశ్వర్యం కలగాలని ప్రజలు ఆకాంక్షించారు.
News
రాజాపూర్ భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
రాజాపూర్ భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
రామగిరి, బిబిఎంఏ న్యూస్, మే 08:
ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-2 విస్తరణలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోతున్న రాజాపూర్ గ్రామ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, రాజాపూర్ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య కలిసి గ్రామ ప్రజల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఎస్సారెస్పీ కాలువ సమీప భూములకు తగిన నష్టపరిహారం, టెంపరరీ నెంబర్ల ఇండ్లకు పూర్తి పరిహారం చెల్లించాలని కోరారు. సింగరేణి బ్లాస్టింగ్‌ల కారణంగా ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాల జారీ నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఈ అంశాలపై స్పందించిన కలెక్టర్ ఆర్డీవో, తహసీల్దార్, ఆర్జీ-3 జీఎంను సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
-
crime2 days agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News4 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment3 days agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 days agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
News1 week agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment3 days agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
