Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో యూరియా సరఫరా, ధాన్యం రవాణాపై డిసిపి రామ్ రెడ్డి సమీక్ష

Published

on

పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో యూరియా సరఫరా, ధాన్యం రవాణాపై డిసిపి రామ్ రెడ్డి సమీక్ష

బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి మే21

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో యూరియా బస్తాల అన్‌లోడింగ్ ప్రాంతాన్ని పెద్దపల్లి డిసిపి పరిశీలించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

బి. రామ్ రెడ్డి సంబంధిత అధికారులతో పాటు హమాలీలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలపై చర్చించారు.

ప్రస్తుతం వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా కోసం అధిక సంఖ్యలో లారీలను వినియోగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న యూరియా ఎరువుల రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు వివరించారు.

ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో పాటు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన లారీ అసోసియేషన్ ప్రతినిధులతో డిసిపి సమావేశమయ్యారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరా నిలిచిపోకుండా, ధాన్యం రవాణా కూడా ఆటంకం లేకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

యూరియా బస్తాల సరఫరా ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని తెలిపారు.

అదేవిధంగా రైల్వే వ్యాగన్ల నుంచి యూరియా బస్తాలను లారీలలోకి ఎక్కిస్తున్న హమాలీల కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని బి. రామ్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, నరేష్, వివిధ శాఖల అధికారులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, హమాలీలు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra

కేరళలో కొట్టియూర్ మహాదేవ ఆలయం 

Published

on

 

స్వయంభూ శివలింగం ఉన్న అపురూప పుణ్యక్షేత్రం…

కొట్టియూర్ మహాదేవ ఆలయం – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయం కలిసిన అపూర్వ పుణ్యక్షేత్రం

 

బిబిఎంఏన్యూస్ (ప్రత్యేక కథనం)

కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లాలోని సాంద్రమైన అటవీ ప్రాంతంలో, బావలి నది తీరాన నెలకొన్న కొట్టియూర్ మహాదేవ ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతన మరియు పుణ్యమైన శైవక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సహజసిద్ధమైన అడవుల మధ్య, నిర్మాణ వైభవానికి దూరంగా, ప్రకృతిని దేవాలయంగా భావించే అరుదైన సంప్రదాయం ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.

ఈ ఆలయం కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు; ఇది పురాణాల, విశ్వాసాల మరియు సహజ జీవన విధానాల సమ్మేళనం. దక్ష యాగం, సతీదేవి ఆత్మార్పణ వంటి పౌరాణిక ఘటనలతో అనుసంధానమై ఉండటంతో ఈ క్షేత్రాన్ని భక్తులు తరచుగా “దక్షిణ వారణాసి”గా పిలుస్తారు. శివతత్వాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చేసే శక్తిక్షేత్రంగా ఇది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఈ ఆలయ సముదాయం మరో విశిష్టత ఏమిటంటే, ఇది రెండు భాగాలుగా విభజించబడింది. నదికి ఒకవైపు ఏడాది పొడవునా దర్శనమిచ్చే ఇక్కరె కొట్టియూర్, మరోవైపు కేవలం వార్షిక ఉత్సవ సమయంలో మాత్రమే తెరుచుకునే అక్కరె కొట్టియూర్. ఈ తాత్కాలిక ఆలయం ప్రతీ సంవత్సరం ప్రకృతిలోనే నిర్మించబడటం, పండుగ అనంతరం పూర్తిగా తొలగించబడటం ఈ క్షేత్రాన్ని ప్రపంచంలోనే అరుదైన ఆధ్యాత్మిక సంప్రదాయంగా నిలబెడుతుంది.

28 రోజుల పాటు జరిగే వార్షిక వైశాఖ మహోత్సవం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. 2026 మే 29 నుండి జూన్ 24 వరకు జరగనున్న ఈ ఉత్సవం ప్రాచీన వేద యజ్ఞ సంప్రదాయాన్ని జీవంగా ప్రతిబింబిస్తుంది. నెయ్యట్టం ద్వారా ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో, భక్తులు లేత కొబ్బరికాయలతో ఏలనీరట్టం వంటి పవిత్ర ఆచారాల్లో పాల్గొంటారు. ప్రతి ఆచారం శుద్ధి, సమర్పణ, భక్తి అనే మూడు ప్రధాన భావాలను ప్రతిబింబిస్తుంది.

మణితార అనే నదీ రాళ్లపై స్వయంభూ శివలింగం వెలసి ఉండటం ఈ ఆలయానికి మరింత పవిత్రతను కలిగిస్తుంది. ప్రకృతి మధ్య, మానవ నిర్మిత గోడలు లేకుండా జరిగే పూజా విధానాలు భక్తులకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి.

సందర్శన పరంగా చూస్తే, కన్నూర్ తలస్సేరి రైల్వే స్టేషన్లు సమీపంలో ఉండగా, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ క్షేత్రానికి ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంది. వర్షాకాలంలో జరిగే ఈ ఉత్సవానికి భారీగా భక్తులు హాజరవుతారు కాబట్టి ముందస్తు ప్రణాళిక, వర్షపు రక్షణ చర్యలు, దీర్ఘ క్యూలకు సిద్ధంగా ఉండటం అవసరం.

ఆధ్యాత్మికతను ప్రకృతితో కలిపే అరుదైన సంప్రదాయం, పురాణాలను జీవంతం చేసే పూజా విధానం, భక్తి భావాన్ని శుద్ధ రూపంలో చూపించే విశిష్టత ఈ అన్ని కారణాల వల్ల కొట్టియూర్ మహాదేవ ఆలయం భారతీయ పుణ్యక్షేత్రాల్లో ఒక అపూర్వ స్థానం సంపాదించింది.

Continue Reading

News

బసంత్ నగర్ చెకపోస్ట్ ను సీపీ ఆకస్మిక తనిఖీ

Published

on

బక్రీద్ నేపథ్యంలో బసంత్ నగర్ టోల్ గేట్ చెక్‌పోస్ట్‌ను అర్ధరాత్రి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

బిబిఎంఏ న్యూస్ / బసంత్ నగర్ మే21

బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

 

ఈ నేపథ్యంలో అర్ధరాత్రి బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అంబర్ కిషోర్ ఝా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల తరలింపు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

పండుగల సమయంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని కమిషనర్ తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద అంశాలపై సమాచారం అందించాలని ఆయన కోరారు.

Continue Reading

crime

వరంగల్ సబ్‌రిజిస్ట్రార్‌ పనిచేసిన దావులూరి ఆనంద్‌పై ఏసీబీ కేసు..

Published

on

 

* రూ.1.94 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు

బిబిఎంఏ న్యూస్ / హనుమకొండ : మే 20 వరంగల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సబ్‌రిజిస్ట్రార్-2గా పనిచేసిన దావులూరి ఆనంద్‌పై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు తెలంగాణ ఏసీబీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు.

అధికారిక ఆదాయానికి మించి అవినీతి మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

సోదాల్లో రెండు ఇండ్లు, ఆరు ప్లాట్లు, రూ.24.50 లక్షల నగదు, బ్యాంక్ నిల్వలు, బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు, గృహోపకరణాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.1.94 కోట్లుగా అంచనా వేస్తుండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.

అక్రమాస్తులపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది. ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు సూచించింది.

Continue Reading

Trending