News
“సే నో టు డ్రగ్స్” నినాదంతో యువతకు మార్గదర్శకుడిగా ఇటుక రాజు మాదిగ
బి బి ఎం ఎ న్యూస్// “సే నో టు డ్రగ్స్” అనే నినాదం ఇటుక రాజు మాదిగ గారి సంకల్పానికి ప్రతీక.
ఇటుక రాజు మాదిగ అనేది కేవలం ఒక పేరు కాదు; అది ఒక ఉద్యమం, ఒక ప్రజా ప్రబంజనం. పదవిని ఆయన అలంకారంగా భావించరు. ప్రజల సంక్షేమం, వారి జీవితాల్లో వెలుగు నింపే బాధ్యతే పదవికి అర్థమని ఆయన విశ్వసిస్తారు. తనపై నమ్మకం ఉంచిన ప్రజల కోసం, న్యాయం సాధించేందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడేందుకు వెనుకాడని మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ప్రజా సమస్యలను లోతుగా అర్థం చేసుకుని, బాధితుల పక్షాన నిలబడి పరిష్కార మార్గాలు చూపడమే ఆయన జీవిత లక్ష్యంగా మారింది.
ప్రత్యేకంగా యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల ముప్పుపై ఇటుక రాజు మాదిగ గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ అనే సామాజిక మహమ్మారి కారణంగా అనేక మంది యువకుల జీవితాలు నాశనమవుతున్నాయనే వాస్తవాన్ని ఆయన స్పష్టంగా గుర్తించారు. ఇది కుల, మత, రాజకీయాలకు అతీతమైన సమస్యగా భావించి, సమాజమంతా ఒక్కటిగా నిలబడాలని పిలుపునిచ్చారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి” అనే నినాదంతో యువతలో అవగాహన కల్పిస్తూ, వారి భవిష్యత్తును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ సామాజిక ఉద్యమంలో బీబీఎంఏ న్యూస్ టీమ్ భాగస్వామ్యం కావడం గర్వకారణంగా నిలిచింది. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని, ఈ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని ఇటుక రాజు మాదిగ పేర్కొన్నారు. అలాగే పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేస్తూ, చట్టపరంగా అవసరమైన అన్ని చర్యలకు తాను మరియు తన అనుచరులు అండగా ఉంటామని తెలిపారు.
మాటలకన్నా కార్యాచరణే సమాజాన్ని మారుస్తుందని నమ్మే ఇటుక రాజు మాదిగ, యువతకు మార్గదర్శకుడిగా, ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తూ, మంచి భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
News
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం
పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా
జైపూర్, బిబిఎంఏ న్యూస్, మే 12:
రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జైపూర్ పోలీస్ స్టేషన్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.
బక్రీద్ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా, మతపరమైన ఉద్రిక్తతలు, నేర సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, నాకాబందీలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడేవారిపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా, నకిలీ విత్తనాల విక్రయాల నివారణకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
crime
అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
బిబిఎంఏ న్యూస్: పెద్దపల్లి( ఓదెల)
అత్యాచార కేసులో నేరం రుజువుకావడంతో ఓదెల మండలానికి చెందిన మాచర్ల అలియాస్ రాచర్ల రాయమల్లుకు పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధించింది.
2024 ఏప్రిల్ 23న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోత్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. కేసులో సమర్థంగా వాదనలు వినిపించిన పీపీ డొంకెన రవీందర్‌తో పాటు దర్యాప్తు అధికారులను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
Devotinal
కొండగట్టు హనుమాన్ జయంతి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
కొండగట్టు, బిబిఎంఏ న్యూస్:
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, మాల విరమణ ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-
crime2 days agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News4 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment4 days agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 days agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
News1 week agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment3 days agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
