Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

కొండగట్టులో పవన్ కళ్యాణ్ పర్యటన: టీటీడీ ఆధ్వర్యంలో దీక్షా విరమణ మండపం, సత్రం నిర్మాణానికి శంకుస్థాపన

Published

on

కొండగట్టులో పవన్ కళ్యాణ్ పర్యటన: టీటీడీ ఆధ్వర్యంలో దీక్షా విరమణ మండపం, సత్రం నిర్మాణానికి శంకుస్థాపన

ప్రెస్ నోట్

 

DATE : 02 / 01/ 2026

 

*జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్య మంత్రి ఏపీ జనసేన పార్టీ అధ్యక్షులు కొండగట్టు అంజన్న సన్నిధి పర్యటన*

 

తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున కొండగట్టు లోని

శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధికి

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేయనున్నారు

 

గతంలో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న సందర్భంలో ఆలయ బోర్డ్ సభ్యులు, అధికారులు భక్తులకు సరిపడే దీక్ష విరమణ మండపాలు లేవు అని మీ తరఫున ఒక మండపాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది

 

శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి అంటే అపారమైన నమ్మకం ఇచ్చిన మాట ప్రకారం కంటే ఇంకా పెద్ద ఎత్తున చేయాలన్న సంకల్పంతో ఎంతో అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు

శ్రీ పవన్ కళ్యాణ్ గారు

 

శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఆధ్వర్యంలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తుల అవసరాల నిమిత్తం కొరకు 2000 మంది భక్తులకు సరిపడే దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల సత్రం నిర్మాణానికి 35.19 కోట్ల వ్యాయామంతో టిటిడి బోర్డు ఆధ్వర్యంలో నిధులను అమోదం చేయించినారు

 

జనవరి 3వ తేదీన (టీటీడీ) బోర్డు ఆధ్వర్యంలో నిర్మాణ శంకుస్థాపన పూజ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు,

 

పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కార్య కర్తల సమావేశం ఉంటుంది ఈ యొక్క కార్యం జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు పార్టీ శ్రేణుల అందరు పాల్గొంటారు

 

 

 

 

ఇట్లు

సాగర్. Rk గారు

జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి

 

జనసేన పార్టీ తెలంగాణ

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

Published

on

బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం

పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా

జైపూర్, బిబిఎంఏ న్యూస్, మే 12:

రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జైపూర్ పోలీస్ స్టేషన్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.

బక్రీద్ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా, మతపరమైన ఉద్రిక్తతలు, నేర సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, నాకాబందీలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడేవారిపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా, నకిలీ విత్తనాల విక్రయాల నివారణకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Continue Reading

crime

అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

Published

on

 

బిబిఎంఏ న్యూస్: పెద్దపల్లి( ఓదెల)

అత్యాచార కేసులో నేరం రుజువుకావడంతో ఓదెల మండలానికి చెందిన మాచర్ల అలియాస్ రాచర్ల రాయమల్లుకు పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధించింది.

2024 ఏప్రిల్ 23న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోత్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. కేసులో సమర్థంగా వాదనలు వినిపించిన పీపీ డొంకెన రవీందర్‌తో పాటు దర్యాప్తు అధికారులను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

Continue Reading

Devotinal

కొండగట్టు హనుమాన్ జయంతి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

Published

on

కొండగట్టు, బిబిఎంఏ న్యూస్:

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, మాల విరమణ ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

Trending