Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

పెంచికల్ పేట లో ఈశ్వరమ్మ ప్రచారం జోరు ….

Published

on

పెంచికల్ పేట లో ఈశ్వరమ్మ ప్రచారం జోరు ….

గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈశ్వరమ్మ ప్రచారం ప్రజలను ఆలోచింప జేస్తుంది..

బిబిఎంఏ న్యూస్ / కమాన్పూర్

డిసెంబర్ 08: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం లోని పెంచికల్ పేట్ గ్రామ సర్పంచ్ జనరల్ మహిళ అభ్యర్థికి కేటాయించడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది సర్పంచ్ అభ్యర్థి గా ఇరుగురాళ్ళ ఈశ్వరమ్మ భరిలో నిలువడంతో పాటు గ్రామ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే “విజన్ 2030”ను ప్రజలకు ప్రచారం లో భాగంగా ఈశ్వరమ్మ మాట్లాడుతూ…
ప్రతి ఇంటికి శుద్ధి త్రాగునీరు, వేసవికాలంలో నీటి సమస్యలు రాకుండా జల కమిటీ ఏర్పాటుతో పునరావృత నివారణ. మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా 20 లీటర్ల నీరు కేవలం రూ.5/-కి అందజేయడానికి ప్రణాళిక. రైతుల కోసం “రైతే రాజు” కమిటీ ఏర్పాటు చేసి పంట కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ పథకాలు, విత్తనాలు, ఎరువుల సమాచారాన్ని సమయానుకూలంగా అందిస్తానని తెలిపారు.
విద్యార్థుల అభివృద్ధికి హైస్కూల్ ప్రారంభం, డిజిటల్ క్లాసులు, పార్కులు, త్రాగునీరు పచ్చదనం కలిగిన పాఠశాలలు ఏర్పాటు. ప్రాథమిక వైద్య కేంద్రం, ఉచిత వ్యాక్సినేషన్ శిబిరాలు, క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ, పశువుల వైద్య శిబిరాలు నిర్వహణకు కార్యాచరణ. ఈశ్వరమ్మ, కొడుకు రాజుతో కలిసి గ్రామ అభివృద్ధికి సక్రమ ప్రణాళికతో పనిచేయనుందని, ఓటు ద్వారా ప్రజలను భాగస్వామ్యులుగా చేసుకుని కొత్త పెంచికల్ పేట్ నిర్మించమని ప్రజలను ఆకర్షించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Devotinal

కొండగట్టు హనుమాన్ జయంతి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

Published

on

కొండగట్టు, బిబిఎంఏ న్యూస్:

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, మాల విరమణ ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

News

అర్ధరాత్రి చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ 

Published

on

బిబిఎంఏ న్యూస్ / తాండూరు

బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు మంచిర్యాల జోన్ పరిధిలోని తాండూరు–రేపల్లెవాడ అంతర్ జిల్లా చెక్‌పోస్ట్‌ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించిన డీసీపీ, వాహనాల తనిఖీ విధానాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పశువుల రవాణాకు సంబంధించిన అన్ని చట్టపరమైన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్‌లో క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు.

అక్రమ పశు రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద రవాణా గమనించిన వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

డీసీపీ వెంట తాండూరు సీఐ దేవయ్య, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు, తాండూరు ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Continue Reading

crime

బీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు

Published

on

హైదరాబాద్, బిబిఎంఏ న్యూస్:

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ దారుణ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు యవన్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని తేలింది. నిందితులు ముందుగా పథకం రచించి మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో యవన్‌పై మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending