Telangana
భారతదేశంలో ఇండిగో విమానాల భారీ ఆందోళనలో ప్రయాణికులు రద్దులు:
భారతదేశంలో ఇండిగో విమానాల భారీ రద్దులు: బెంగళూరు, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు ఆందోళనలో ప్రయాణికులు
బీబీఎంఏ న్యూస్
భారతదేశవ్యాప్తంగా ఇండిగో విమానయాన సంస్థ శనివారం 400 కి పైగా విమానాలను రద్దు చేసింది. నిర్వహణ సమస్యలు కారణంగా ప్రధానంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు గంభీరంగా ప్రభావితమయ్యాయి. ప్రత్యేకంగా బెంగళూరులో 124, ముంబైలో 109, ఢిల్లీలో 106 విమానాలు రద్దు అయ్యాయి. ఇతర ప్రధాన నగర విమానాశ్రయాల ద్వారా కూడా వందలవారు ప్రభావితులయ్యారు. వేలాది ప్రయాణికులు ఈ రద్దుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇందులో ఇండిగో విమానయాన సంస్థ క్షమాపణలు తెలిపారు. సంస్థ, కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు తమ ఫ్లైట్ స్టేటస్ ఆన్లైన్ లేదా ఏజెంట్ల ద్వారా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారు ముందుగా తనిఖీ చేయడం మరింత ముఖ్యమని సూచించారు.
Devotinal
కొండగట్టు హనుమాన్ జయంతి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
కొండగట్టు, బిబిఎంఏ న్యూస్:
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, మాల విరమణ ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News
అర్ధరాత్రి చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్
బిబిఎంఏ న్యూస్ / తాండూరు
బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు మంచిర్యాల జోన్ పరిధిలోని తాండూరు–రేపల్లెవాడ అంతర్ జిల్లా చెక్‌పోస్ట్‌ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించిన డీసీపీ, వాహనాల తనిఖీ విధానాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పశువుల రవాణాకు సంబంధించిన అన్ని చట్టపరమైన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్‌లో క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు.
అక్రమ పశు రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద రవాణా గమనించిన వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
డీసీపీ వెంట తాండూరు సీఐ దేవయ్య, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు, తాండూరు ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
crime
బీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
హైదరాబాద్, బిబిఎంఏ న్యూస్:
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ దారుణ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు యవన్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని తేలింది. నిందితులు ముందుగా పథకం రచించి మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో యవన్‌పై మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
-
crime2 days agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News4 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment3 days agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 days agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
News1 week agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment3 days agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
