Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

పెద్దపల్లి డీసీపీ గోదావరిఖని డివిజన్ పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీలు 

Published

on

  1. పెద్దపల్లి డీసీపీ గోదావరిఖని డివిజన్ పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీలు

 

బిబిఎంఏ న్యూస్ / రామగుండం నవంబర్ 25

 

గోదావరిఖని సబ్‌డివిజన్‌లోని ప్రజా భద్రత, పోలీస్ కార్యాచరణలను సమీక్షించేందుకు పెద్దపల్లి జోన్ డీసీపీ భూక్యా రామ్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్‌తో కలిసి డీసీపీ గోదావరిఖని 2 టౌన్, కమాన్ పూర్, రామగిరి, మంథని, మంథని ముత్తారం పోలీస్ స్టేషన్లను సందర్శించారు.

 

స్టేషన్‌లలో నమోదైన కేసుల వివరాలు, సమస్యలు, పెండింగ్ కేసులు, చట్ట వ్యతిరేక కార్యకలపాలు, సిబ్బంది పనితీరు, ప్రజలతో పోలీసులు వ్యవహరించే విధానం వంటి అంశాలను అధికారులు వివరంగా సమీక్షించారు.

 

డీసీపీ సిబ్బందికి సూచనలు ఇస్తూ, ప్రజల భద్రత, శాంతి, నేరాల నియంత్రణ, స్టేషన్ పరిసరాల నిర్వహణ, రిసెప్షన్, బ్లూ క్లోట్స్ సిబ్బంది విధులు, డయల్ 100 కాల్ స్పందన, సీసీ కెమెరాల పనితీరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పునరుద్దేశించారు.

 

ప్రజల సమస్యలను సమయములో తెలుసుకొని చట్టపరంగా పరిష్కరించుతూ క్షేత్ర స్థాయిలో సేవలందించడంలో పోలీసు సిబ్బంది ముందుండేలా ఉండాలని డీసీపీ హెచ్చరించారు. ఈ సందర్భంగా గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, మంథని సిఐ రాజు, ఇతర ఎస్‌ఐలతో కూడిన అధికారులు పాల్గొన్నారు.

 

 

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

Published

on

బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం

పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా

జైపూర్, బిబిఎంఏ న్యూస్, మే 12:

రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జైపూర్ పోలీస్ స్టేషన్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.

బక్రీద్ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా, మతపరమైన ఉద్రిక్తతలు, నేర సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, నాకాబందీలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడేవారిపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా, నకిలీ విత్తనాల విక్రయాల నివారణకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Continue Reading

News

అర్ధరాత్రి చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ 

Published

on

బిబిఎంఏ న్యూస్ / తాండూరు

బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు మంచిర్యాల జోన్ పరిధిలోని తాండూరు–రేపల్లెవాడ అంతర్ జిల్లా చెక్‌పోస్ట్‌ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించిన డీసీపీ, వాహనాల తనిఖీ విధానాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పశువుల రవాణాకు సంబంధించిన అన్ని చట్టపరమైన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్‌లో క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు.

అక్రమ పశు రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద రవాణా గమనించిన వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

డీసీపీ వెంట తాండూరు సీఐ దేవయ్య, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావు, తాండూరు ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Continue Reading

crime

బీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు

Published

on

హైదరాబాద్, బిబిఎంఏ న్యూస్:

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ దారుణ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు యవన్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని తేలింది. నిందితులు ముందుగా పథకం రచించి మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో యవన్‌పై మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending