Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

crime

అనిశా అధికారులకు పట్టుబడిన జనగాం జిల్లాలోని పాలకుర్తి సబ్-డివిజన్, మిషన్ భగీరథ (INTRA), ఉపకార్యనిర్వాహక ఇంజనీరు – కూనమల్ల సంధ్యా రాణి.

Published

on

అనిశా అధికారులకు పట్టుబడిన జనగాం జిల్లాలోని పాలకుర్తి సబ్-డివిజన్, మిషన్ భగీరథ (INTRA), ఉపకార్యనిర్వాహక ఇంజనీరు - కూనమల్ల సంధ్యా రాణి.

ఫిర్యాదుధారుని చేత పూర్తిచేయబడిన మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో తనిఖీ చేసి వాటితోబాటు సంబంధిత చివరి బిల్లులను కార్యనిర్వాహక ఇంజనీరు గారికి పంపించడానికి” ఫిర్యాదుధారుని నుండి డిమాండ్ చేసిన రూ.10,000/- #లంచం ను తన యొక్క ప్రైవేట్ సహాయకుడు అయిన మహేందర్ యొక్క UPI ఖాతా ద్వారా తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన జనగాం జిల్లాలోని పాలకుర్తి సబ్-డివిజన్, మిషన్ భగీరథ (INTRA), ఉపకార్యనిర్వాహక ఇంజనీరు – కూనమల్ల సంధ్యా రాణి.

 

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.

“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Published

on

 BBMA NEWS:

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

Continue Reading

crime

లంబాడితండాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్.. గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం

Published

on

బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

 

పోలీసుల వివరాల ప్రకారం, జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, రెండు డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో 20 మోటార్‌సైకిళ్లు, రెండు ఆటోలు, రెండు ట్రాక్టర్ల పత్రాలను తనిఖీ చేశారు.

 

ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

 

కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్‌ఐ రామకృష్ణ, బెల్లంపల్లి-2 టౌన్ ఎస్‌ఐ కిరణ్ కుమార్‌తో పాటు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

ACB

ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై అక్రమాస్తుల కేసు నమోదు

Published

on

హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ రోడ్లు & భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) చీఫ్ ఇంజినీర్ (స్టేట్ రోడ్స్) జరుపుల మోహన్ నాయక్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది. అవినీతి, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు.

 

మోహన్ నాయక్ కార్యాలయం, నివాసం, బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, కొంపల్లి, గచ్చిబౌలిలో ఏడు ఫ్లాట్లు, మియాపూర్‌లో ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, నిజామాబాద్‌లో విల్లా కొనుగోలుకు చెల్లించిన అడ్వాన్స్‌ సహా పలు ఆస్తులు గుర్తించారు.

 

అదనంగా రూ.55 లక్షల నగదు, రూ.1.44 కోట్ల బ్యాంకు నిల్వలు, సుమారు 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

 

ఏసీబీ ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17.94 కోట్లకు పైగా ఉండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Continue Reading

Trending