crime
సుల్తానాబాద్‌లో పోలీసుల పేరుతో బెదిరించి దోపిడీ చేసిన గ్యాంగ్ అరెస్ట్
సుల్తానాబాద్‌లో పోలీసుల పేరుతో బెదిరించి దోపిడీ చేసిన గ్యాంగ్ అరెస్ట్
బంగారం, వెండి, వాహనాలు సహా భారీ స్వాధీనం
బిబిఎంఎ న్యూస్/సుల్తానాబాద్,
నవంబర్ 15:
పోలీసులమని నమ్మించి ఇంట్లో వాళ్లను బెదిరించి బంగారం–వెండిని దోచుకున్న దొంగల గ్యాంగ్‌ను సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గర్రెపల్లి గ్రామానికి చెందిన సంకరి లక్ష్మీ ఇంట్లో నవంబర్ 10 తెల్లవారుజామున జరిగిన దోపిడీ కేసును పోలీసులు కేవలం కొన్ని రోజుల్లో ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
నేరం ఇలా జరిగింది
గతంలో దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించిన నాగుల కుమారస్వామి, జైల్లో పరిచయం అయిన రవీందర్, శ్యామ్ రావు మరియు ఆ తర్వాత పరిచయమైన పురుషోత్తం నాగరాజుతో కలిసి ఈ దోపిడీకి పన్నాగం పన్నాడు. అందరికీ గిరాకీ అప్పులు ఉండడంతో సులభంగా దోపిడీ చేసి డబ్బు సంపాదిద్దామని నిర్ణయించుకున్నారు.
పోలీసుల వేషధారణ కోసం కుమారస్వామి మీషోలో బేడీలు, కరీంనగర్‌లో పోలీస్ లోగోలు ఉన్న స్వెట్టర్లు, స్టార్‌లు కొనుగోలు చేశాడు. నాగరాజు సూచించిన గర్రెపల్లి గ్రామంలోని రమేష్ ఇంటి వద్ద ఎక్కువ బంగారం ఉంటుందని తెలిసి అక్కడ దోపిడీ చేయాలని నిర్ణయించారు.
నవంబర్ 10 ఉదయం 4.15 గంటలకు రెండు కార్లలో అక్కడికి చేరుకున్న నిందితులు “కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు” అని చెప్పి ఇంటి తలుపు తెరవబట్టి లోపలికి వెళ్లారు. రమేష్‌కు బేడీలు వేసి, బెదిరించి బీరువా తెరవించి మొత్తం బంగారం, వెండితో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని పారిపోయారు. ప్రశ్నించిన వారిని చంపేస్తామని బెదిరించారు.
అరెస్టులు ఇలా జరిగాయి
సుల్తానాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాలుగువురు నిందితులు Xylo కారులో దొంగతనం చేసిన బంగారం అమ్మడానికి కరీంనగర్‌కు వెళ్తుండగా కాట్నపల్లి శివారులో వారిని అడ్డగింత చేసి అరెస్టు చేశారు.
స్వాధీనం చేసిన సొత్తు
బంగారం మొత్తం: 115.4 గ్రాములు
మూడు చైన్లు
బిస్కట్ గోల్డ్ (మొత్తం 46 గ్రాములు)
నాలుగు రింగులు
వెండి: 472 గ్రాములు
క్యాష్: ₹10,000
వాహనాలు: Xylo కారు, Wagon R కారు, TVS XL బైక్
అపరాధంలో వాడిన వస్తువులు: హ్యాండ్‌కఫ్స్, పోలీస్ లోగో ఉన్న స్వెట్టర్లు, గ్లోవ్స్, ఫేక్ నెంబర్ ప్లేట్స్
కేసును ఛేదించిన పోలీస్ అధికారులు
సిహేచ్ శ్రావణ్ కుమార్, ఎస్‌ఐ – సుల్తానాబాద్
సనత్ రెడ్డి, ఎస్‌ఐ – జులపల్లి
వెంకటేశ్, ఎస్‌ఐ – కాల్వ శ్రీరాంపూర్
పోలీస్ సిబ్బంది
సుల్తానాబాద్ పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని దోపిడీ గ్యాంగ్‌ను అరెస్టు చేసి, బాధితులకు న్యాయం చేయడం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
crime
వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్
BBMA NEWS:
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
crime
లంబాడితండాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్.. గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం
బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, రెండు డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో 20 మోటార్‌సైకిళ్లు, రెండు ఆటోలు, రెండు ట్రాక్టర్ల పత్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్‌ఐ రామకృష్ణ, బెల్లంపల్లి-2 టౌన్ ఎస్‌ఐ కిరణ్ కుమార్‌తో పాటు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ACB
ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై అక్రమాస్తుల కేసు నమోదు
హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ రోడ్లు & భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) చీఫ్ ఇంజినీర్ (స్టేట్ రోడ్స్) జరుపుల మోహన్ నాయక్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది. అవినీతి, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు.
మోహన్ నాయక్ కార్యాలయం, నివాసం, బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, కొంపల్లి, గచ్చిబౌలిలో ఏడు ఫ్లాట్లు, మియాపూర్‌లో ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, నిజామాబాద్‌లో విల్లా కొనుగోలుకు చెల్లించిన అడ్వాన్స్ సహా పలు ఆస్తులు గుర్తించారు.
అదనంగా రూ.55 లక్షల నగదు, రూ.1.44 కోట్ల బ్యాంకు నిల్వలు, సుమారు 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17.94 కోట్లకు పైగా ఉండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
ACB4 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News2 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News1 day agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
