Telangana
హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.
కుక్క, కోతి కరిచిన కేసులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని, వారికి క్రమం తప్పకుండా చికిత్స అందిస్తూ కోర్సు పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
చిన్నారుల నెలవారి టీకాలు, గర్భిణీల 4 ఆరోగ్య పరీక్షలు 100 శాతం పూర్తి చేయాలని అన్నారు. చికిత్స కోసం వచ్చిన పలువురు వృద్ధులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
News
సహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
* సహజీవనం ముగియడం మాత్రమే చట్టపరంగా నేరం కాదు.. వివాహానికి ఉన్న హక్కులు స్వయంచాలకంగా వర్తించవని స్పష్టం
బీబీఎంఏ న్యూస్: న్యూఢిల్లీ
15 ఏళ్ల పాటు సహజీవనం చేసి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భాగస్వామి తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) భారత చట్టాల ప్రకారం నేరం కాదని, అయితే అది వివాహంతో సమానమైన చట్టబద్ధ బంధం కూడా కాదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధంలో భాగస్వాములు తమ ఇష్టప్రకారమే కలిసి ఉండవచ్చని, అదే విధంగా విడిపోవచ్చని వ్యాఖ్యానించింది. కేవలం సహజీవనం ముగిసిందనే కారణంతో కోర్టు భాగస్వామిని తిరిగి కలిసి ఉండేలా ఆదేశించలేదని స్పష్టం చేసింది. అయితే ప్రతి కేసు దాని ప్రత్యేక పరిస్థితులు, వర్తించే చట్టాల ఆధారంగా నిర్ణయించబడుతుందని కూడా న్యాయస్థానం పేర్కొంది. లివ్-ఇన్ సంబంధాలపై ఇప్పటికే ఉన్న చట్టపరమైన రక్షణలు, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మహిళలకు, పిల్లలకు లభించే హక్కులు వేర్వేరు చట్టాల ప్రకారం పరిశీలించబడతాయని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
News
మహాముత్తారం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ ఆకస్మిక తనిఖీ
సాదాబైనమా, భూ సేకరణ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష – పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం
మహాముత్తారం, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):
కాటారం ఆర్‌డీఓ మహాముత్తారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాదాబైనమా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణకు సంబంధించిన పిటిషన్ల విచారణ పురోగతిని పరిశీలించారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందేలా ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, విచారణల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు.
News
నూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
పెద్దపల్లి, జిల్లా బిబిఎంఎ న్యూస్ జూన్ 14:
నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత నూతన పోలీస్ స్టేషన్ల స్వంత భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన భూ విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, ప్రజలకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదికను త్వరితగతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
End
-
News4 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News4 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News3 days agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
-
News4 weeks agoనేడు మృగశిర కార్తె ప్రారంభం.. రైతన్నకు ఆశల పండుగ
