Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

BBMA POLICE E:NEWS// ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా బాధ్యతలు స్వీకరణ

Published

on

BBMA POLICE E:NEWS// ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా బాధ్యతలు స్వీకరణ

BBMA POLICE E:NEWS// ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా బాధ్యతలు స్వీకరణ

Adilabad జిల్లా బిసి అభివృద్ధి అధికారిగా ధారావత్ సోనియా నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ Rajarshi Shah గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖ కార్యకలాపాలపై చర్చించగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.

పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

జిల్లాలో బిసి వర్గాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు సేవాభావంతో విధులు నిర్వహించాలని సోనియాకు మార్గనిర్దేశం చేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్‌కు ఘన సన్మానం.. కందుల

Published

on

రామగుండం | జూలై 11, 2026 తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా, అలాగే లక్ష్మీపురం గేట్ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి పోతన కాలనీ సింగరేణి కారిడార్ రోడ్డు వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, కొక్కిరాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి సాలువాతో ఘనంగా సత్కరించి, ప్రాంత అభివృద్ధికి చేస్తున్న కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపురం ప్రాంత ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కందుల సతీష్, వేణుగోపాలరావు, మహమ్మద్ గౌస్, ఇరుకుల సంతోష్, కె. అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

SIR కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించిన కార్పొరేటర్ స్వరూప సతీష్

Published

on

గోదావరిఖని: 21వ డివిజన్ లక్ష్మీపురం ప్రాంతంలోని బూత్ నంబర్-230 పరిధిలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలకు SIR కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు.

ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇంటింటికీ వచ్చే బీఎల్‌ఓలకు పూర్తి వివరాలు అందించి తమ ఓటును మ్యాపింగ్‌లో భద్రపరచుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బడుగు శ్రీనివాస్, కొలిపాక కనకరాజు, స్థానిక మహిళలు మరియు ఇతరులు పాల్గొని SIR కార్యక్రమానికి సహకారం అందించారు.

Continue Reading

News

వెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

Published

on

జగిత్యాల,జూలై 11: వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన గంగుల సనత్ కుమార్ (38)కు జగిత్యాల 1వ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించింది. 2024 ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై అప్పటి ఎస్‌ఐ ఉమాసాగర్ కేసు నమోదు చేయగా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి సమగ్ర దర్యాప్తు చేసి పటిష్టమైన ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది బిట్ల నర్సయ్య సమర్థవంతంగా వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీమతి జి. సునీత రవీంద్ర రెడ్డి నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ మాట్లాడుతూ మహిళలు, యువతులు తమపై జరిగే వేధింపులు, లైంగిక దాడులు లేదా ఇతర అన్యాయాల విషయంలో భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా పోలీసు శాఖ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఈ కేసులో సమర్థంగా పనిచేసిన పీపీ బిట్ల నర్సయ్య, దర్యాప్తు అధికారి రామ్ నరసింహారెడ్డి, అప్పటి ఎస్‌ఐ ఉమాసాగర్, కోర్టు సిబ్బంది తదితరులను ఎస్పీ అభినందించారు.

Continue Reading

Trending