Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు

Published

on

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల చెల్లింపు సహా పలు డిమాండ్లతో రాష్ట్రవ్యాప్త ఆందోలన

తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. SFI, AISF, PDSU, AIDSO విద్యార్థి సంఘాలు ఈ బంద్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలను విరమించుకోవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సంఘాలు డిమాండ్ చేశాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రులకు సందేశాలు పంపించాయి. మరోవైపు, బంద్ కారణంగా కోల్పోయే బోధనా దినాన్ని భర్తీ చేసేందుకు కొన్ని పాఠశాలలు జూలై 11 (రెండో శనివారం) తరగతులు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ విద్యాసంస్థల నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

గ్రామాభివృద్ధిపై కలెక్టర్ శ్రీహర్ష దిశానిర్దేశం 

Published

on

బీబీఎంఏ న్యూస్ | పెద్దపల్లి | జూలై 9 గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ప్రతి గ్రామపంచాయతీ స్థానిక అవసరాలు, వనరులకు అనుగుణంగా మూడు సంవత్సరాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లోని సహజ వనరులను వినియోగించి స్థానిక ఆదాయ మార్గాలను పెంపొందించే ప్రణాళికలు రూపొందించాలని, గ్రామపంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, తడి, పొడి, ప్లాస్టిక్ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి అర్హ కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, మహిళా సంఘాల కోసం నిర్మిస్తున్న వీఓ భవనాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

అలాగే, ఇందిరమ్మ కమిటీ ప్రతిపాదించిన గృహాల అర్హుల జాబితాను గెజిటెడ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించాలని, మండల అభివృద్ధి అధికారులు సమన్వయంతో పారదర్శకంగా గృహాల ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Continue Reading

News

ఓదెల పెద్దమ్మ తల్లి జాతరలో బోనం ఎత్తిన బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష

Published

on

ఓదెల, జూలై 8 (బీబీఎంఏ న్యూస్): పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న పెద్దమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవాల్లో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, జాతర కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయబద్ధంగా నెత్తిన బోనం ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించిన ఉషక్క, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సతీష్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మంద కొమురయ్య, పెండ ఓదెలు, తుడి సురేష్, తుడి ప్రవీణ్, స్వామి, బీరం రవి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

ఆదిలాబాద్ రణ దివ్య నగర్ లో కాటన్ సెర్చ్

Published

on

ఆదిలాబాద్ జిల్లా రణ దివ్యానగర్‌లో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 150 మంది పోలీసులతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 128 వాహనాలను తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్‌లు లేని 16 వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే అక్రమంగా తరలిస్తున్న 10 మద్యం క్వార్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థంగా అరికట్టగలమని, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Continue Reading

Trending