News
BBMA POLICE E:NEWS// Arrive Alive కార్యక్రమంతో డ్రైవర్లకు ఆరోగ్య–రోడ్డు భద్రత అవగాహన
BBMA POLICE E:NEWS// Arrive Alive కార్యక్రమంతో డ్రైవర్లకు ఆరోగ్య–రోడ్డు భద్రత అవగాహన
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో “Arrive Alive” కార్యక్రమం భాగంగా పోలీస్ శాఖ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో మొత్తం 230 మంది డ్రైవర్లు పాల్గొని తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో డ్రైవర్ల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ రక్షణాత్మక డ్రైవింగ్ పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, అక్రమ రవాణా వంటి చర్యలను పూర్తిగా నివారించాలని హెచ్చరించారు.
ఈ శిబిరంలో 30 మంది డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేయగా, మరింత వైద్యం అవసరమైన వారికి చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు. డ్రైవర్ల ఆరోగ్యం మెరుగుపడితేనే రోడ్డు భద్రత సాధ్యమని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమం ద్వారా అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు.
News
మంచిర్యాలలో భారీ సెర్చ్ ఆపరేషన్.. 300 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు
రూ.20 వేల అక్రమ మద్యం, 166 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, తల్వార్ స్వాధీనం – మత్తు పదార్థాలు, నేరాల నిర్మూలనే లక్ష్యం: సీపీ అంబర్ కిషోర్ ఝా
బీబీఎంఏ న్యూస్, మంచిర్యాల, జూలై 12:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో సుమారు 300 మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది ఎన్టీఆర్ నగర్‌లో అర్ధరాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా రూ.20 వేల విలువైన అక్రమ మద్యం, పత్రాలు లేని 166 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రోడ్లపై పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన 10 మంది యువకులు, అలాగే 10 మంది పాత నేరస్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందిస్తున్నామని, పోలీసులకు సహకరిస్తే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే యువతకు మార్గదర్శకత్వం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావుతో పాటు పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News
ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్‌కు ఘన సన్మానం.. కందుల
రామగుండం | జూలై 11, 2026 తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా, అలాగే లక్ష్మీపురం గేట్ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి పోతన కాలనీ సింగరేణి కారిడార్ రోడ్డు వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, కొక్కిరాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి సాలువాతో ఘనంగా సత్కరించి, ప్రాంత అభివృద్ధికి చేస్తున్న కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపురం ప్రాంత ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కందుల సతీష్, వేణుగోపాలరావు, మహమ్మద్ గౌస్, ఇరుకుల సంతోష్, కె. అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు.
News
SIR కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించిన కార్పొరేటర్ స్వరూప సతీష్
గోదావరిఖని: 21వ డివిజన్ లక్ష్మీపురం ప్రాంతంలోని బూత్ నంబర్-230 పరిధిలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలకు SIR కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు.
ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇంటింటికీ వచ్చే బీఎల్‌ఓలకు పూర్తి వివరాలు అందించి తమ ఓటును మ్యాపింగ్‌లో భద్రపరచుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బడుగు శ్రీనివాస్, కొలిపాక కనకరాజు, స్థానిక మహిళలు మరియు ఇతరులు పాల్గొని SIR కార్యక్రమానికి సహకారం అందించారు.
-
crime6 days agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
Telangana15 hours agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News4 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News1 week agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News4 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News4 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News1 week agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana4 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
