Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

crime

BBMA POLICE E:NEWS// అనంతపురం హత్య కేసులో ట్విస్ట్ – నిందితుడిపై పోలీసుల కాల్పులు

Published

on

BBMA POLICE E:NEWS// అనంతపురం హత్య కేసులో ట్విస్ట్ – నిందితుడిపై పోలీసుల కాల్పులు

BBMA POLICE E:NEWS// అనంతపురం హత్య కేసులో ట్విస్ట్ – నిందితుడిపై పోలీసుల కాల్పులు

అనంతపురం జిల్లా కోనుప్పలపాడులో బాలుడి హత్య కేసు దర్యాప్తులో సంచలన మలుపు చోటుచేసుకుంది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు సర్వేష్‌ అకస్మాత్తుగా పోలీసులపై తిరగబడ్డాడు. అక్కడే పడివున్న బీర్‌ బాటిల్‌తో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ దాడి ఆపకపోవడంతో, ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో సర్వేష్‌కు రెండు కాళ్లలో బుల్లెట్‌ గాయాలు కావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడిలో సీఐ బోయ రామసుబ్బయ్యతో పాటు మరో కానిస్టేబుల్‌ కూడా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ పరిణామం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

#Anantapur #Konuppalapadu #PoliceFiring #CrimeNewsAP

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Published

on

 BBMA NEWS:

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

Continue Reading

crime

లంబాడితండాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్.. గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం

Published

on

బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

 

పోలీసుల వివరాల ప్రకారం, జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, రెండు డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో 20 మోటార్‌సైకిళ్లు, రెండు ఆటోలు, రెండు ట్రాక్టర్ల పత్రాలను తనిఖీ చేశారు.

 

ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

 

కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్‌ఐ రామకృష్ణ, బెల్లంపల్లి-2 టౌన్ ఎస్‌ఐ కిరణ్ కుమార్‌తో పాటు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

ACB

ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై అక్రమాస్తుల కేసు నమోదు

Published

on

హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ రోడ్లు & భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) చీఫ్ ఇంజినీర్ (స్టేట్ రోడ్స్) జరుపుల మోహన్ నాయక్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది. అవినీతి, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు.

 

మోహన్ నాయక్ కార్యాలయం, నివాసం, బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, కొంపల్లి, గచ్చిబౌలిలో ఏడు ఫ్లాట్లు, మియాపూర్‌లో ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, నిజామాబాద్‌లో విల్లా కొనుగోలుకు చెల్లించిన అడ్వాన్స్‌ సహా పలు ఆస్తులు గుర్తించారు.

 

అదనంగా రూ.55 లక్షల నగదు, రూ.1.44 కోట్ల బ్యాంకు నిల్వలు, సుమారు 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

 

ఏసీబీ ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17.94 కోట్లకు పైగా ఉండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Continue Reading

Trending