News
ప్రమాదాల నివారణకు కసరత్తు బ్లాక్‌స్పాట్‌ల పరిశీలన రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ప్రమాదాల నివారణకు కసరత్తు బ్లాక్‌స్పాట్‌ల పరిశీలన రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
బీబీఎంఏ న్యూస్ / రామగుండం
రాజీవ్ రహదారిపై తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కీలక చర్యలు చేపట్టింది. ప్రమాదాల నివారణకు భాగంగా, సీపీ అంబర్ కిషోర్ ఝా ఈరోజు గోదావరిఖని బి-గెస్ట్ హౌస్ మూల మలుపు మరియు ఇందారం క్రాస్ రోడ్ వద్ద ఉన్న బ్లాక్‌స్పాట్‌లను ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, హారికే సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్శనలో ప్రమాదాల గత కారణాలు, ఐలాండ్‌ల డిజైన్, రేడియం బ్లింకర్లు, స్టడ్స్ ఏర్పాటు, సిసి కెమెరాల అవసరం, ప్రమాద స్థలాల గుర్తింపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి, తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు సేఫ్టీ కమిటీలను క్షేత్రస్థాయిలో బ్లాక్‌స్పాట్‌లను పరిశీలించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘అరైవ్ & అలైవ్’ కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తికి చేరవేసి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 1టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, రోడ్ సేఫ్టీ టీమ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
News
బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి
కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
News
సహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
* సహజీవనం ముగియడం మాత్రమే చట్టపరంగా నేరం కాదు.. వివాహానికి ఉన్న హక్కులు స్వయంచాలకంగా వర్తించవని స్పష్టం
బీబీఎంఏ న్యూస్: న్యూఢిల్లీ
15 ఏళ్ల పాటు సహజీవనం చేసి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భాగస్వామి తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) భారత చట్టాల ప్రకారం నేరం కాదని, అయితే అది వివాహంతో సమానమైన చట్టబద్ధ బంధం కూడా కాదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధంలో భాగస్వాములు తమ ఇష్టప్రకారమే కలిసి ఉండవచ్చని, అదే విధంగా విడిపోవచ్చని వ్యాఖ్యానించింది. కేవలం సహజీవనం ముగిసిందనే కారణంతో కోర్టు భాగస్వామిని తిరిగి కలిసి ఉండేలా ఆదేశించలేదని స్పష్టం చేసింది. అయితే ప్రతి కేసు దాని ప్రత్యేక పరిస్థితులు, వర్తించే చట్టాల ఆధారంగా నిర్ణయించబడుతుందని కూడా న్యాయస్థానం పేర్కొంది. లివ్-ఇన్ సంబంధాలపై ఇప్పటికే ఉన్న చట్టపరమైన రక్షణలు, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మహిళలకు, పిల్లలకు లభించే హక్కులు వేర్వేరు చట్టాల ప్రకారం పరిశీలించబడతాయని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
News
చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
జూలై 5న హైదరాబాద్‌లో ‘అనిత ఓ అనిత’ 20 ఏళ్ల వేడుకల
భూపాలపల్లి, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ప్రముఖ సినీ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ ఆహ్వాన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీపతి రాము, డప్పు సత్తి, బండి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ‘అనిత ఓ అనిత’ పాట రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. ప్రేమికులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల సంగీతాభిమానులను ఆకట్టుకున్న ఈ ఫోక్ గీతం తెలుగు ఫోక్ సంగీతంలో ప్రేమ పాటలకు కొత్త దారిని చూపిందన్నారు. విడుదలై 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పాట రచయితలు, గాయకులు, గాయని అనిత నాగరాజ్‌తో కలిసి జూలై 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాటల రచయితలు, గాయకులు, సంగీతాభిమానులు, ఫోక్ కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
ACB4 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News2 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News1 day agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
