News
మహేష్ బాబు ఈవెంట్ కోసం రాచకొండ పోలీస్ల పర్యవేక్షణ
రాచకొండలో భద్రతా సమీక్ష: మహేష్ బాబు ఈవెంట్స్ కోసం పోలీస్ చర్యలు బలోపేతం
బీబీఎంఏ న్యూస్ /రాచకొండ:
సీపీ సుధీర్ బాబు ఐపీస్ ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సమావేశం నేపధ్యంలో సినిమా స్టార్ మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ టీజర్ లాంచ్ మరియు రేపటి రామోజీ ఫిల్మ్ సిటీలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం జరగనున్న నేపథ్యంలో, రహదారులపై ట్రాఫిక్ జామ్ రాకుండా, ఈవెంట్‌కు వచ్చే అభిమానులు సౌకర్యంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు.
సాధారణంగా భారీ పబ్లిక్ ఈవెంట్లలో ఏర్పడే ట్రాఫిక్ సమస్యలను ముందస్తు ఏర్పాట్లతో నియంత్రించడం, లా & ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యంగా అవసరమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఐపీస్, ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ ఐపీస్, క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఐపీస్, ఎసటి రమణ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, SB జి నరసింహారెడ్డి, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, అడ్మిన్ డీసీపీ ఇందిరా, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, విమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా రాణి తదితర అధికారులు పాల్గొన్నారు.
సీపీ సుధీర్ బాబు అధికారులకు ఈవెంట్ ప్రణాళికలు, పబ్లిక్ కౌన్స్‌లింగ్, అత్యవసర సేవల అందుబాటు వంటి అంశాలను సమీక్షించి, భద్రతా చర్యల్లో ఖచ్చితత్వం పాటించాలని ఆదేశించారు.
పోలీస్ శాఖ ఈవెంట్ల సమయంలో ప్రజలకు సౌకర్యాన్ని కల్పించడం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమని పేర్కొన్నారు.
News
బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి
కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
News
సహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
* సహజీవనం ముగియడం మాత్రమే చట్టపరంగా నేరం కాదు.. వివాహానికి ఉన్న హక్కులు స్వయంచాలకంగా వర్తించవని స్పష్టం
బీబీఎంఏ న్యూస్: న్యూఢిల్లీ
15 ఏళ్ల పాటు సహజీవనం చేసి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భాగస్వామి తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) భారత చట్టాల ప్రకారం నేరం కాదని, అయితే అది వివాహంతో సమానమైన చట్టబద్ధ బంధం కూడా కాదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధంలో భాగస్వాములు తమ ఇష్టప్రకారమే కలిసి ఉండవచ్చని, అదే విధంగా విడిపోవచ్చని వ్యాఖ్యానించింది. కేవలం సహజీవనం ముగిసిందనే కారణంతో కోర్టు భాగస్వామిని తిరిగి కలిసి ఉండేలా ఆదేశించలేదని స్పష్టం చేసింది. అయితే ప్రతి కేసు దాని ప్రత్యేక పరిస్థితులు, వర్తించే చట్టాల ఆధారంగా నిర్ణయించబడుతుందని కూడా న్యాయస్థానం పేర్కొంది. లివ్-ఇన్ సంబంధాలపై ఇప్పటికే ఉన్న చట్టపరమైన రక్షణలు, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మహిళలకు, పిల్లలకు లభించే హక్కులు వేర్వేరు చట్టాల ప్రకారం పరిశీలించబడతాయని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
News
చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
జూలై 5న హైదరాబాద్‌లో ‘అనిత ఓ అనిత’ 20 ఏళ్ల వేడుకల
భూపాలపల్లి, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ప్రముఖ సినీ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ ఆహ్వాన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీపతి రాము, డప్పు సత్తి, బండి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ‘అనిత ఓ అనిత’ పాట రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. ప్రేమికులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల సంగీతాభిమానులను ఆకట్టుకున్న ఈ ఫోక్ గీతం తెలుగు ఫోక్ సంగీతంలో ప్రేమ పాటలకు కొత్త దారిని చూపిందన్నారు. విడుదలై 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పాట రచయితలు, గాయకులు, గాయని అనిత నాగరాజ్‌తో కలిసి జూలై 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాటల రచయితలు, గాయకులు, సంగీతాభిమానులు, ఫోక్ కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
ACB4 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News2 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News1 day agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
