Telangana
మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబాన్ని పరామర్శించిన వ్యాల్ల హరీష్ రెడ్డి…
మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబాన్ని పరామర్శించిన వ్యాల్ల హరీష్ రెడ్డి…
బీబీఎంఏ న్యూస్ / సిద్దిపేట్
మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవలే స్వర్గస్తులైన సందర్భంగా హైదరాబాదులోని వారి నివాసమునకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి పరామర్శించడం జరిగింది . స్వర్గీయ తన్నీరు సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని నింపాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి జాహిద్ పాషా,తాజా మాజీ కార్పొరేటర్లు ఎన్వి రమణ రెడ్డి,రవి నాయక్ యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌగిలి,మడిశెట్టి రవి, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, , రామస్వామి, బోట్ల పోషం, అల్లి గణేష్,నడిపల్లి సాయి, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు అతహరుద్దీన్, ఎరగోళ్ళ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
News
సహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
* సహజీవనం ముగియడం మాత్రమే చట్టపరంగా నేరం కాదు.. వివాహానికి ఉన్న హక్కులు స్వయంచాలకంగా వర్తించవని స్పష్టం
బీబీఎంఏ న్యూస్: న్యూఢిల్లీ
15 ఏళ్ల పాటు సహజీవనం చేసి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భాగస్వామి తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) భారత చట్టాల ప్రకారం నేరం కాదని, అయితే అది వివాహంతో సమానమైన చట్టబద్ధ బంధం కూడా కాదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధంలో భాగస్వాములు తమ ఇష్టప్రకారమే కలిసి ఉండవచ్చని, అదే విధంగా విడిపోవచ్చని వ్యాఖ్యానించింది. కేవలం సహజీవనం ముగిసిందనే కారణంతో కోర్టు భాగస్వామిని తిరిగి కలిసి ఉండేలా ఆదేశించలేదని స్పష్టం చేసింది. అయితే ప్రతి కేసు దాని ప్రత్యేక పరిస్థితులు, వర్తించే చట్టాల ఆధారంగా నిర్ణయించబడుతుందని కూడా న్యాయస్థానం పేర్కొంది. లివ్-ఇన్ సంబంధాలపై ఇప్పటికే ఉన్న చట్టపరమైన రక్షణలు, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మహిళలకు, పిల్లలకు లభించే హక్కులు వేర్వేరు చట్టాల ప్రకారం పరిశీలించబడతాయని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
News
మహాముత్తారం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ ఆకస్మిక తనిఖీ
సాదాబైనమా, భూ సేకరణ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష – పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం
మహాముత్తారం, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):
కాటారం ఆర్‌డీఓ మహాముత్తారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాదాబైనమా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణకు సంబంధించిన పిటిషన్ల విచారణ పురోగతిని పరిశీలించారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందేలా ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, విచారణల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు.
News
నూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
పెద్దపల్లి, జిల్లా బిబిఎంఎ న్యూస్ జూన్ 14:
నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత నూతన పోలీస్ స్టేషన్ల స్వంత భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన భూ విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, ప్రజలకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదికను త్వరితగతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
End
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News4 weeks agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB4 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News1 day agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News21 hours agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
