Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

ఆదిలాబాద్ రణ దివ్య నగర్ లో కాటన్ సెర్చ్

Published

on

ఆదిలాబాద్ జిల్లా రణ దివ్యానగర్‌లో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 150 మంది పోలీసులతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 128 వాహనాలను తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్‌లు లేని 16 వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే అక్రమంగా తరలిస్తున్న 10 మద్యం క్వార్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థంగా అరికట్టగలమని, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ముత్తారం మండలంలో  విద్యుత్ షాక్‌తో రైతు మృతి..

Published

on

మోటార్ నిర్వహణ సమయంలో ప్రమాదం.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ముత్తారం, బీబీఎంఏ న్యూస్, జూలై 7: ముత్తారం మండలంలోని పారుపల్లి సమీపంలో మంగళవారం జరిగిన విషాద ఘటనలో రైతు మారం వెంకట్ రెడ్డి (45) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు, ఉదయం తన వ్యవసాయ భూమికి వెళ్లిన వెంకట్ రెడ్డి మోటార్ నిర్వహణ కోసం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని భావించి కిందకు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న వెంకట్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, విద్యుత్ పరికరాల వద్ద పనిచేసే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ శాఖ భద్రతపై మరింత అవగాహన కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Continue Reading

crime

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్

Published

on

సిద్దిపేట, బీబీఎంఏ న్యూస్, జూలై 6:

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కోర్రా దిలీప్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. నాగపురి గ్రామానికి చెందిన 11 నాలా (NALA) భూ మార్పిడి దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అనుకూలంగా చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా, సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

 

నిందితుడి వద్ద నుంచి రూ.70 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు తెలిపింది.

Continue Reading

News

బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి

Published

on

కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending