News
దేవాదుల ప్రాజెక్ట్‌లో ఉప ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ములుగు, జూలై 13: కన్నాయిగూడెం దేవాదుల ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆదివారం రాత్రి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అధికారుల సమావేశ వేదిక, హెలిపాడ్, గోదావరి నది వ్యూ పాయింట్‌ను పరిశీలించిన అధికారులు, అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదుల ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జీ, ఇరిగేషన్ ఈఈ శంకరయ్య, నారాయణ, ఆర్డీవో కృష్ణవేణి, డీపీవో వెంకయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Entertainment
ఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ పిలుపు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక ఐబీ కాలనీ లో వెలసిన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రావుల స్వరాజ్ పాల్గొని మాట్లాడుతూ.. పెద్దమ్మతల్లి ఆలయం & నాగదేవత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 15 బుధవారం నుండి నెల రోజులపాటు నిర్వహించు ఆషాడ మాస శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో ముదిరాజ్ కులస్తులు, బంధువులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి, అమ్మవారి కృపను పొందగలరని ఆలయ కమిటీ కోరుతుంది. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యార్థం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు అప్పరాజు ప్రభాకర్, బర్ల మల్లయ్య, ఇస్తారి, శీలం శ్రీనివాస్, చిగురు సాయి, చొప్పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
News
ఖని ఫోటో అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మల్లేష్, కార్యదర్శిగా మహేష్ ఎన్నిక
బీబీఎంఏ న్యూస్:గోదావరిఖని స్థానిక ఫోటో భవన్‌లో ఖని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా మల్లేష్, కార్యదర్శిగా మహేష్ కోశాధికారి రామగిరి శ్రీనివాస్లు ఎన్నికయ్యారు. సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ హామీ ఇచ్చింది.
News
రాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
భూముల రక్షణకు హామీ ఇచ్చిన ఎంపీ ఈటెల రాజేందర్ – అవసరమైతే ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని స్పష్టం
మేడ్చల్, బీబీఎంఏ న్యూస్, జూలై 12: రాంపల్లి సర్వే నంబర్ 226లో కుమ్మరి, వడ్డరి, ఎరుకల పనిముట్ల కులాలకు ప్రభుత్వం గతంలో కేటాయించిన సుమారు 8 ఎకరాల భూమిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రామస్థులు, కుల సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఘనపురం శ్యామసుందర్ శర్మ ఆధ్వర్యంలో సంఘాల ప్రతినిధులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రం స్వీకరించిన ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఈ భూములు అనేక కుటుంబాల జీవనాధారమని, అభివృద్ధి చెందుతున్న కాలనీ మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ప్రజారోగ్యానికి, పర్యావరణానికి హానికరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం కీసర ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడిన ఎంపీ, కుమ్మరి, వడ్డరి, ఎరుకల సంఘాల భూముల జోలికి వెళ్లవద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాను స్వయంగా రాంపల్లికి వచ్చి ధర్నాలో పాల్గొని ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని హెచ్చరించారు.
అదేవిధంగా కుమ్మరి, వడ్డరి, ఎరుకల సంఘాల కోసం ఎంపీ నిధుల నుంచి ప్రతి సంఘానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ మునిగంటి సురేష్, నాగారం డివిజన్ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజు యాదవ్, సీనియర్ నాయకులు బొమ్మిడి బుచ్చిరెడ్డి, బిజ్జా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-
crime1 week agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
Telangana2 days agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News4 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News2 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News4 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News4 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
Entertainment15 hours agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News3 days agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
