Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ వేడుకలు

Published

on

 

ఈద్గాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

 

బిబిఎంఏ న్యూస్ : రామగుండం

 

బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, కరుణ, శాంతికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

 

పండుగ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఈద్గాలు, మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ తెలిపారు. ప్రార్థనల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక బందోబస్తు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రేమ, మానవత్వం, త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. ప్రజలంతా పరస్పర మతాలను గౌరవించుకుంటూ సోదరభావంతో పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.

 

సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించిన సీపీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్థానిక పోలీసులను లేదా డయల్-100ను సంప్రదించాలని కోరారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

బయట ధరల కంటే రూ.10 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపణ.. డిపో అధికారులకు ఫిర్యాదు

Published

on

జూలై 15 (బీబీఎంఏ న్యూస్):కరీంనగర్ ఆర్టీసీ డిపో బస్‌స్టాండ్ ఆవరణలోని దుకాణాల్లో వినియోగదారుల నుంచి వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని సామాజిక కార్యకర్త గోనె మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై డిపో అసిస్టెంట్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు.

 

బయట మార్కెట్‌లో రూ.10కు లభించే ఇండిపెండెంట్ గోల్డ్ కంపెనీ నీటి బాటిల్‌ను బస్‌స్టాండ్‌లోని దుకాణాల్లో రూ.20కు విక్రయిస్తున్నారని, అలాగే టాటా ఒక లీటర్ వాటర్ బాటిల్‌ను కూడా మార్కెట్ ధర కంటే రూ.10 అధికంగా అమ్ముతున్నారని పేర్కొన్నారు. గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దుకాణ సిబ్బందే చెబుతున్నారని ఆయన అన్నారు.

 

బస్‌స్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, సామాన్య ప్రజలు అధిక ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, అన్ని వస్తువులను ముద్రిత గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) లేదా బయట మార్కెట్ ధరలకు అనుగుణంగా విక్రయించేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గోనె మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Continue Reading

crime

2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్

Published

on

పెద్దపల్లి, జూలై 14 (బీబీఎంఏ న్యూస్): పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం నిర్వహించిన దాడుల్లో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మున్సిపల్ పరిధిలో బిల్లులు విడుదల చేయడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏఈని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేష్ దర్ రెడ్డి నేతృత్వంలో అధికారులు ఏఈ నివాసంతో పాటు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Continue Reading

Andhra

విధులకు వెళ్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ దుర్మరణం.. మృతిపై పలు అనుమానాలు

Published

on

బీబీఎంఏ న్యూస్ – పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి సంచలనంగా మారింది. సోమవారం అర్థరాత్రి చిత్తూరులోని ఎంపీడీఎల్ డిస్టిలరీలో విధులకు బైక్‌పై వెళ్తుండగా పుంగనూరు టోల్‌గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

దేవేంద్ర 2023లో మదనపల్లె రామిరెడ్డిగారిపల్లె శివారులో కొనుగోలు చేసిన ఇంటి స్థలం విషయంలో తనను మోసం చేశారని ఆరోపిస్తూ తరిగొండ శ్రీనివాసులు రెడ్డి, నారాయణ రెడ్డి, సుధాకర్‌లపై ఇటీవల మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దేవేంద్ర మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది రోడ్డు ప్రమాదంగా నమోదు కాగా, భూ వివాదంతో ఏమైనా సంబంధం ఉందా అనే అంశంతో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Continue Reading

Trending