News
ప్రజల భద్రతే లక్ష్యం : సీఐ ఇంద్రసేన రెడ్డి
బిబిఎంఏ న్యూస్ / గోదావరిఖని :
ప్రజల భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి తెలిపారు. మంగళవారం వినోబానగర్, రెల్లివాడ, లెనిన్‌నగర్ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలపై జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా యువతకు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. మహిళలు, బాలికలపై సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News
కొనుగోలు చేసిన వరి వెంటనే మిల్లులకు తరలించాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ధర్మపురి, (బిబిఎంఎ న్యూస్) – మే 19
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పెగడపల్లి మండలం నంచర్ల, దేవికొండ, రామ్‌నగర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం ఎండపల్లి మండల కేంద్రంలోని వాయుపుత్ర రైస్ మిల్‌తో పాటు గుల్లకోట గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేసి ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.
ధాన్యం తూకం, నిల్వ, రవాణా ప్రక్రియల్లో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆయన అన్నారు. కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ ఆన్లైన్‌లో నమోదు చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో చెల్లింపులు జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు.
మిల్లులకు ధాన్యంతో చేరిన లారీలను ఆలస్యం చేయకుండా త్వరగా అన్‌లోడ్ చేసి తిరిగి పంపించాలని మిల్లర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచి వరిని వర్షం, తేమ నుంచి రక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియను సమన్వయంతో వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైస్ మిల్లులలో నిల్వలు, మిల్లింగ్, లోడింగ్–అన్‌లోడింగ్ పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీసీఎస్ఓ జితేందర్ రెడ్డి, డీఎస్ఓ మనోజ్, తహసీల్దార్ అనిల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
News
ఫేక్ లింకులు, ఆన్‌లైన్ మోసాలకు దూరంగా ఉండాలి : ఎస్ఐ ఉదయ్ కుమార్
అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలి – జగిత్యాల పోలీసులు
బిబిఎంఏ న్యూస్ /ఎండపల్లి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, సోషల్ మీడియా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఓటీపీలు ఇతరులతో పంచుకోవడం, ఫేక్ లింకులు క్లిక్ చేయడం, సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు, ఆన్‌లైన్ లోన్లు, ఫేక్ జాబ్ ఆఫర్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు.
యువతలో డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుతోందని, వాటి వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పోలీస్ కళాబృందం ప్రత్యేక ప్రదర్శనలు, పాటల ద్వారా సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, రాత్రివేళల్లో దొంగతనాల నివారణ, మహిళలు, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించింది. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
News
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ : సీపీ అంబర్ కిషోర్ ఝా
బిబిఎంఏ న్యూస్ / మంచిర్యాల
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ పోచమ్మ గుడి ప్రాంతంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. మహిళల భద్రత కోసం షీ టీమ్‌లు, భరోసా సెంటర్లు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, సీఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
-
crime1 week agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News5 days agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
News4 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News4 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
Entertainment1 week agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime1 week agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime6 days agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News2 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
