Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

BBMA POLICE E:NEWS// గృహ నిర్మాణాలు జూన్‌లోపు పూర్తి చేయాలి – కలెక్టర్ ఆదేశం

Published

on

BBMA POLICE E:NEWS// గృహ నిర్మాణాలు జూన్‌లోపు పూర్తి చేయాలి – కలెక్టర్ ఆదేశం

BBMA POLICE E:NEWS// గృహ నిర్మాణాలు జూన్‌లోపు పూర్తి చేయాలి – కలెక్టర్ ఆదేశం

జిల్లాలో మంజూరైన గృహ నిర్మాణాలన్నింటినీ ఈ ఏడాది జూన్ మాసం లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోపు చేరుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ లేఅవుట్లలో 16,316 ఇళ్లు, వ్యక్తిగత స్థలాల్లో 3,161 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

టిడ్కో ఇళ్ల పూర్తి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలాల వారీగా డీఈలు, ఏఈలు లబ్ధిదారులతో సమన్వయం చేసుకుని నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

రాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక

Published

on

భూముల రక్షణకు హామీ ఇచ్చిన ఎంపీ ఈటెల రాజేందర్ – అవసరమైతే ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని స్పష్టం

మేడ్చల్, బీబీఎంఏ న్యూస్, జూలై 12: రాంపల్లి సర్వే నంబర్ 226లో కుమ్మరి, వడ్డరి, ఎరుకల పనిముట్ల కులాలకు ప్రభుత్వం గతంలో కేటాయించిన సుమారు 8 ఎకరాల భూమిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రామస్థులు, కుల సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఘనపురం శ్యామసుందర్ శర్మ ఆధ్వర్యంలో సంఘాల ప్రతినిధులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రం స్వీకరించిన ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఈ భూములు అనేక కుటుంబాల జీవనాధారమని, అభివృద్ధి చెందుతున్న కాలనీ మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ప్రజారోగ్యానికి, పర్యావరణానికి హానికరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం కీసర ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడిన ఎంపీ, కుమ్మరి, వడ్డరి, ఎరుకల సంఘాల భూముల జోలికి వెళ్లవద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాను స్వయంగా రాంపల్లికి వచ్చి ధర్నాలో పాల్గొని ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని హెచ్చరించారు.

అదేవిధంగా కుమ్మరి, వడ్డరి, ఎరుకల సంఘాల కోసం ఎంపీ నిధుల నుంచి ప్రతి సంఘానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మంజూరు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ మునిగంటి సురేష్, నాగారం డివిజన్ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజు యాదవ్, సీనియర్ నాయకులు బొమ్మిడి బుచ్చిరెడ్డి, బిజ్జా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

మంచిర్యాలలో భారీ సెర్చ్ ఆపరేషన్.. 300 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు

Published

on

రూ.20 వేల అక్రమ మద్యం, 166 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, తల్వార్ స్వాధీనం – మత్తు పదార్థాలు, నేరాల నిర్మూలనే లక్ష్యం: సీపీ అంబర్ కిషోర్ ఝా

బీబీఎంఏ న్యూస్, మంచిర్యాల, జూలై 12:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో సుమారు 300 మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది ఎన్టీఆర్ నగర్‌లో అర్ధరాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా రూ.20 వేల విలువైన అక్రమ మద్యం, పత్రాలు లేని 166 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

రోడ్లపై పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన 10 మంది యువకులు, అలాగే 10 మంది పాత నేరస్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

 

ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందిస్తున్నామని, పోలీసులకు సహకరిస్తే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే యువతకు మార్గదర్శకత్వం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు.

 

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావుతో పాటు పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

News

ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్‌కు ఘన సన్మానం.. కందుల

Published

on

రామగుండం | జూలై 11, 2026 తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా, అలాగే లక్ష్మీపురం గేట్ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి పోతన కాలనీ సింగరేణి కారిడార్ రోడ్డు వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, కొక్కిరాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి సాలువాతో ఘనంగా సత్కరించి, ప్రాంత అభివృద్ధికి చేస్తున్న కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీపురం ప్రాంత ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కందుల సతీష్, వేణుగోపాలరావు, మహమ్మద్ గౌస్, ఇరుకుల సంతోష్, కె. అశోక్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending