News
BBMA POLICE E:NEWS// సంపూర్ణత అభియాన్ 2.0లో లక్ష్యాల సాధనపై కలెక్టర్ దృష్టి
BBMA POLICE E:NEWS// సంపూర్ణత అభియాన్ 2.0లో లక్ష్యాల సాధనపై కలెక్టర్ దృష్టి
సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌లో నిర్దేశించిన 39 సూచికలలో వంద శాతం లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ IAS గారు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా శాఖల పనితీరును విశ్లేషించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం, తాగునీటి సదుపాయాలు పూర్తిస్థాయిలో ఉండేలా చూడాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ, పాఠశాల మరుగుదొడ్లను గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. పశువులకు ఎఫ్‌ఎమ్‌డీ టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలని పేర్కొన్నారు.
వైద్య ఆరోగ్య సేవల్లో వెనుకబాటుతనంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రతి వారం మండల స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. గట్టు బ్లాక్ ర్యాంకింగ్ మెరుగుపడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన సలహాలు ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News
ఖని ఫోటో అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మల్లేష్, కార్యదర్శిగా మహేష్ ఎన్నిక
బీబీఎంఏ న్యూస్:గోదావరిఖని స్థానిక ఫోటో భవన్‌లో ఖని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా బైరం సతీష్, ఎలగందుల శ్రీనివాస్, ఎం.డి. మహబూబ్, కొడిపెళ్లి వాసురావు, కసిఓజ్జుల నరసింహచారి వ్యవహరించారు. మూడు ప్యానెల్లు పోటీలో నిలవగా మిట్టపల్లి సమ్మయ్య ప్యానెల్‌కు 18 ఓట్లు, గుబ్బుల సుబ్రహ్మణ్యం ప్యానెల్‌కు 58 ఓట్లు, శనిగరపు మల్లేష్ ప్యానెల్‌కు 106 ఓట్లు లభించాయి. దీంతో మల్లేష్ ప్యానెల్ 51 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. నూతన అధ్యక్షుడిగా మల్లేష్, కార్యదర్శిగా మహేష్ ఎన్నికయ్యారు. ఎన్నికలను జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల విజయ్, ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఇర్ఫాన్, కోశాధికారి అల్లం సతీష్ తదితరులు పర్యవేక్షించారు. సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కమిటీ హామీ ఇచ్చింది.
News
రాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
భూముల రక్షణకు హామీ ఇచ్చిన ఎంపీ ఈటెల రాజేందర్ – అవసరమైతే ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని స్పష్టం
మేడ్చల్, బీబీఎంఏ న్యూస్, జూలై 12: రాంపల్లి సర్వే నంబర్ 226లో కుమ్మరి, వడ్డరి, ఎరుకల పనిముట్ల కులాలకు ప్రభుత్వం గతంలో కేటాయించిన సుమారు 8 ఎకరాల భూమిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రామస్థులు, కుల సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఘనపురం శ్యామసుందర్ శర్మ ఆధ్వర్యంలో సంఘాల ప్రతినిధులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రం స్వీకరించిన ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఈ భూములు అనేక కుటుంబాల జీవనాధారమని, అభివృద్ధి చెందుతున్న కాలనీ మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ప్రజారోగ్యానికి, పర్యావరణానికి హానికరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం కీసర ఆర్డీఓతో ఫోన్‌లో మాట్లాడిన ఎంపీ, కుమ్మరి, వడ్డరి, ఎరుకల సంఘాల భూముల జోలికి వెళ్లవద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాను స్వయంగా రాంపల్లికి వచ్చి ధర్నాలో పాల్గొని ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని హెచ్చరించారు.
అదేవిధంగా కుమ్మరి, వడ్డరి, ఎరుకల సంఘాల కోసం ఎంపీ నిధుల నుంచి ప్రతి సంఘానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ మునిగంటి సురేష్, నాగారం డివిజన్ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజు యాదవ్, సీనియర్ నాయకులు బొమ్మిడి బుచ్చిరెడ్డి, బిజ్జా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
News
మంచిర్యాలలో భారీ సెర్చ్ ఆపరేషన్.. 300 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు
రూ.20 వేల అక్రమ మద్యం, 166 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, తల్వార్ స్వాధీనం – మత్తు పదార్థాలు, నేరాల నిర్మూలనే లక్ష్యం: సీపీ అంబర్ కిషోర్ ఝా
బీబీఎంఏ న్యూస్, మంచిర్యాల, జూలై 12:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో సుమారు 300 మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది ఎన్టీఆర్ నగర్‌లో అర్ధరాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా రూ.20 వేల విలువైన అక్రమ మద్యం, పత్రాలు లేని 166 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రోడ్లపై పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన 10 మంది యువకులు, అలాగే 10 మంది పాత నేరస్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందిస్తున్నామని, పోలీసులకు సహకరిస్తే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే యువతకు మార్గదర్శకత్వం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మంచిర్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావుతో పాటు పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
crime6 days agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
Telangana24 hours agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News4 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News1 week agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News4 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News4 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News1 week agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
News1 day agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
