Telangana
పెద్దంపేట్ సర్పంచ్ గెలుపే లక్ష్యంగా బుషిపాక సాయినాథ్ (సంతోష్ )మహారాజ్ ప్రచారం…
పెద్దంపేట్ సర్పంచ్ గెలుపే లక్ష్యంగా బుషిపాక సాయినాథ్ (సంతోష్ )మహారాజ్ ప్రచారం…
బిబిఎంఎ న్యూస్ /పెద్దంపేట:
పెద్దపెల్లి జిల్లా అంతర్గ మండలం పెద్దంపేట్ గ్రామ పంచాయతీ ఎస్సీ జనరల్ కేటాయించడం తో
బుషిపాక సాయినాథ్ (సంతోష్ మహారాజ్)అంబేద్కర్ వాదిగా, సమాజ సేవకుడిలా, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన సాయినాథ్ సర్పంచి అభ్యర్థిగా పోటీలో నిలవడం పెద్దంపేట గ్రామపంచాయతీలో పరిధిలో ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఈ సందర్భంగా సాయినాథ్ మహారాజ్ మాట్లాడుతూ…
సర్పంచ్‌గా అభ్యర్థిగా మేనిఫెస్టో ప్రకటించారు. “పల్లె ప్రగతి పంచ సూత్రాలు”తో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దే ప్రతిజ్ఞ వ్యక్తం చేశారు.
ముఖ్యాంశాలుగా సురక్షిత తాగునీరు, భద్రత, పారిశుధ్యం, స్వయం సమృద్ధి, సమాజ సమానత్వం. ప్రతి ఇంటికి శుద్ధి నీరు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత నీటి కుళాయిలు, గ్రామంలో సీసీ కెమెరాలు, విద్యుత్ సౌకర్యాలు, రోడ్ల నిర్మాణం, టెలీమెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
పేదవాళ్లకు గృహాలు, చిన్నారులకు పౌష్టికాహారం, ఉపాధి హామీ కింద వృత్తి అవకాశాలు, మహిళల సాధికారత కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా ప్రధాన అభివృద్ధి విధానంగా ఉన్నదని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
సంపూర్ణ సమగ్ర సర్వే ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించి, ఆస్తి పన్నుపై రాయితీలు, సహజ వనరులను ఉపయోగించి గ్రామంలో ఉపాధి అవకాశాలను పెంచే విధానాలను కొనసాగిస్తారు. సాయినాథ్, “గాంధీజీ కలలుగన్న గ్రామ వికాసాన్ని సాధిద్దాం” అని ప్రజలకు హామీ ఇచ్చారు.
News
బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి
కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
News
చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
జూలై 5న హైదరాబాద్‌లో ‘అనిత ఓ అనిత’ 20 ఏళ్ల వేడుకల
భూపాలపల్లి, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ప్రముఖ సినీ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ ఆహ్వాన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీపతి రాము, డప్పు సత్తి, బండి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ‘అనిత ఓ అనిత’ పాట రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. ప్రేమికులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల సంగీతాభిమానులను ఆకట్టుకున్న ఈ ఫోక్ గీతం తెలుగు ఫోక్ సంగీతంలో ప్రేమ పాటలకు కొత్త దారిని చూపిందన్నారు. విడుదలై 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పాట రచయితలు, గాయకులు, గాయని అనిత నాగరాజ్‌తో కలిసి జూలై 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాటల రచయితలు, గాయకులు, సంగీతాభిమానులు, ఫోక్ కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Telangana
ఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
మహబూబాబాద్ జిల్లా , నర్సింహులపేట, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్):
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో సహకరించిన మరో అధికారి యాకయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
ACB4 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News2 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News1 day agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
