Telangana
మహిళల భద్రతకు షీ టీమ్స్ ప్రత్యేక నిఘా: రామగుండం సిపి కిషోర్ ఝా
మహిళల భద్రతకు షీ టీమ్స్ ప్రత్యేక నిఘా: రామగుండం సిపి కిషోర్ ఝా
బీబీఎంఏ న్యూస్ /
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, యువతుల భద్రత కోసం షీ టీమ్స్ మఫ్టీ లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. స్కూళ్లు, కళాశాలలు, బస్టాండ్లు, ఆఫీసులు ముగిసే సమయాల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణించే ప్రాంతాల్లో షీ టీమ్స్ సాధారణ ప్రజల మాదిరిగా మఫ్టీ లో ఉంటూ వేధింపులు, అసభ్య ప్రవర్తనపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం జరుగుతోందన్నారు.
మహిళల భద్రత, రక్షణ పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని సీపీ తెలిపారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, బాల్య వివాహాలు, డ్రగ్స్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, లేదా షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్‌కి సమాచారం ఇస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అలాగే, ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు అందుకునేలా QR కోడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.
నవంబర్–2025లో షీ టీమ్స్ కార్యకలాపాలు
మొత్తం అందిన పిటిషన్లు: 68
వాట్సాప్ & ప్రత్యక్ష ఫిర్యాదులు: 15
FIRలు: 04
పెట్టీ కేసులు: 04
కౌన్సిలింగ్: 02
హెచ్చరికతో విడిచివేత: 05
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసులు: 53
పెట్టీ కేసులు: 05
కౌన్సిలింగ్: 26
హెచ్చరించి వదిలివేత: 22
డీకాయ్ ఆపరేషన్లలో పట్టుబడిన యువకులు: 60 మంది
నవంబర్–2025లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు
పెద్దపల్లి 29
మంచిర్యాల 34
మొత్తం 63
హాట్‌స్పాట్ ప్రాంతాల పర్యవేక్షణ
జిల్లా సంఖ్య
పెద్దపల్లి 117
మంచిర్యాల 115
మొత్తం 232
అత్యవసర కేసులకు సంప్రదించవలసిన నెంబర్లు
📞 రామగుండం షీ టీమ్: 6303923700
📞 పెద్దపల్లి జోన్: 8712659386
📞 మంచిర్యాల జోన్: 8712659386
📞 డయల్ 100 – 24/7 పోలీస్ సహాయం
మహిళలు ఎక్కడ ఉన్నా భద్రతగా ఉండేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు విధుల్లో ఉన్నారని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.
News
బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి
కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
News
చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
జూలై 5న హైదరాబాద్‌లో ‘అనిత ఓ అనిత’ 20 ఏళ్ల వేడుకల
భూపాలపల్లి, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ప్రముఖ సినీ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ ఆహ్వాన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీపతి రాము, డప్పు సత్తి, బండి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ‘అనిత ఓ అనిత’ పాట రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. ప్రేమికులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల సంగీతాభిమానులను ఆకట్టుకున్న ఈ ఫోక్ గీతం తెలుగు ఫోక్ సంగీతంలో ప్రేమ పాటలకు కొత్త దారిని చూపిందన్నారు. విడుదలై 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పాట రచయితలు, గాయకులు, గాయని అనిత నాగరాజ్‌తో కలిసి జూలై 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాటల రచయితలు, గాయకులు, సంగీతాభిమానులు, ఫోక్ కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Telangana
ఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
మహబూబాబాద్ జిల్లా , నర్సింహులపేట, జూన్ 12 (బీబీఎంఏ న్యూస్):
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధికను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో సహకరించిన మరో అధికారి యాకయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నర్సింహులపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News4 weeks agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB4 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News2 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News22 hours agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
