crime
ఏఐకి ‘మాటల’ మాయ.. కంపెనీల డేటాకు ‘ప్రాంప్ట్’ గండం!
ఏఐకి ‘మాటల’ మాయ.. కంపెనీల డేటాకు ‘ప్రాంప్ట్’ గండం!
కృత్రిమ మేధ (AI) విస్తృతి పెరిగాక.. చిన్న స్టార్టప్‌ల నుంచి బడా మల్టీ నేషనల్ కంపెనీల వరకు అంతా ఇప్పుడు ‘ఏఐ చాట్‌బోట్’ల జపం చేస్తున్నాయి. కస్టమర్ల సందేహాలకు క్షణాల్లో సమాధానాలివ్వడం, పని వేగం పెంచడం, ఖర్చు తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉండటంతో సంస్థలు వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, ఈ సాంకేతికత వెనుక ఓ సరికొత్త ముప్పు పొంచి ఉంది. అదే ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ (Prompt Injection).
అసలేంటీ ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’?
సాధారణంగా ఏఐ పని చేయడానికి మనం ఇచ్చే ఆదేశాలను ‘ప్రాంప్ట్’ అంటారు. సైబర్ నేరగాళ్లు ఈ ప్రాంప్ట్‌లనే ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఏఐ మోడల్‌ను తప్పుదోవ పట్టించేలా, ట్రిక్ చేసేలా ‘మలీషియస్ ప్రాంప్ట్స్’ (కీడు చేసే ఆదేశాలు) ఇస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే.. “ఏఐని మాటలతో మాయ చేయడం”. ఇలా ఏఐని కన్ఫ్యూజ్ చేసి, సాధారణంగా బయటపెట్టకూడని సంస్థల అంతర్గత పత్రాలు, కస్టమర్ల రికార్డులు, సిస్టమ్ వివరాలను రాబట్టడమే ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్’.
డేటా భద్రతకు పెను సవాల్
ప్రస్తుతం చాలా సంస్థలు తమ ఏఐ మోడల్స్, చాట్‌బోట్‌లను సంస్థలోని కీలకమైన డేటా సిస్టమ్‌లకు (CRM డేటా, హెల్ప్‌డెస్క్ టికెట్లు, ఉద్యోగుల సమాచారం, ఫైనాన్షియల్ రికార్డులు) అనుసంధానిస్తున్నాయి. ఎండ్ యూజర్‌కు ఈ సమాచారం పొరపాటున కూడా కనిపించకూడదు. కానీ, హ్యాకర్లు వేసే ఒకే ఒక్క ‘ట్రిక్కీ ప్రాంప్ట్’ వల్ల ఈ గోప్య సమాచారమంతా బయటపడే ప్రమాదం ఉంది.
‘గార్డ్‌రెయిల్స్’తోనే రక్షణ
ఈ ముప్పును పసిగట్టి, నివారించడానికి సంస్థలు తక్షణమే ‘ప్రాంప్ట్ గార్డ్‌రెయిల్స్’ (రక్షణ కవచాలు) ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక అంచె భద్రత సరిపోదు, మల్టీ-లేయర్ డిఫెన్స్ విధానాన్ని పాటించాలి.
జాగ్రత్తలివే..!
• మోడల్-లెవల్ సెక్యూరిటీ: ఏఐకి సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం, కఠినమైన నిబంధనలు (Hard Guardrails) విధించడం ద్వారా అనవసర సమాచారాన్ని ఇవ్వకుండా నియంత్రించాలి.
• ప్రాంప్ట్-లెవల్ సెక్యూరిటీ: హానికరమైన (Malicious) ప్రాంప్ట్‌లను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
• సిస్టమ్-లెవల్ సెక్యూరిటీ: ఏఐకి యాక్సెస్ ఇచ్చే డేటా, ఏపీఐ (API)లపై కఠిన నియంత్రణలు ఉండాలి.
• ఆడిట్స్ & యాక్సెస్: ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్స్ నిర్వహిస్తూ.. డేటా యాక్సెస్‌ను పరిమితం చేయాలి.
సరైన భద్రతా చర్యలు తీసుకోకపోతే సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోవడంతో పాటు, విలువైన డేటా నేరగాళ్ల చేతికి చిక్కి కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉంది.
crime
వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్
BBMA NEWS:
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
crime
లంబాడితండాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్.. గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం
బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, రెండు డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో 20 మోటార్‌సైకిళ్లు, రెండు ఆటోలు, రెండు ట్రాక్టర్ల పత్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్‌ఐ రామకృష్ణ, బెల్లంపల్లి-2 టౌన్ ఎస్‌ఐ కిరణ్ కుమార్‌తో పాటు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ACB
ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై అక్రమాస్తుల కేసు నమోదు
హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ రోడ్లు & భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) చీఫ్ ఇంజినీర్ (స్టేట్ రోడ్స్) జరుపుల మోహన్ నాయక్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది. అవినీతి, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు.
మోహన్ నాయక్ కార్యాలయం, నివాసం, బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, కొంపల్లి, గచ్చిబౌలిలో ఏడు ఫ్లాట్లు, మియాపూర్‌లో ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, నిజామాబాద్‌లో విల్లా కొనుగోలుకు చెల్లించిన అడ్వాన్స్ సహా పలు ఆస్తులు గుర్తించారు.
అదనంగా రూ.55 లక్షల నగదు, రూ.1.44 కోట్ల బ్యాంకు నిల్వలు, సుమారు 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17.94 కోట్లకు పైగా ఉండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
-
News4 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News4 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News3 days agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
-
News4 weeks agoనేడు మృగశిర కార్తె ప్రారంభం.. రైతన్నకు ఆశల పండుగ
