News
ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ
ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ – క్రమశిక్షణ, పారదర్శక దర్యాప్తుపై క్లియర్ సందేశం
బిబిఎంఏ న్యూస్ / అదిలాబాద్:
అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, సిబ్బంది నిర్వాహణ, పహారా విధులపై ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసింగ్‌లో క్రమశిక్షణ మరియు నిష్పక్షపాత వైఖరి అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ఎస్పీ ఆధునిక టెక్నాలజీ ఆధారిత దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీసీ కెమెరా విశ్లేషణ, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ ఆధారాలను వేగంగా కోర్టుకు పంపడం వంటి అంశాలను అధికారులు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో డ్రగ్స్ రవాణా, అక్రమ కార్యకలాపాలు, రౌడీషీటర్ల చెర నుంచి ప్రజా భద్రత కోసం నిరంతర నిఘా కొనసాగించాలని తెలిపారు. యువతను డ్రగ్స్ ప్రమాదాల నుంచి దూరంగా ఉంచేందుకు కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
పోలీసులు ప్రజలకు అండగా నిలిచి, బాధితులకు వెంటనే సహాయం అందించేందుకు స్పందనశీలత అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసింగ్ అంటే కేవలం కేసులు నమోదు చేయడం కాకుండా, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే సేవా ధృక్పథం ఉండాలని చెప్పారు.
తనిఖీలో సిబ్బంది హాజరు, ఆయుధాల సంరక్షణ, స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ వంటి విభాగాలపై ఆయన ప్రత్యేక సూచనలు చేశారు.
అదిలాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌ఓ, సీఐ, ఇతర సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు.
News
బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి
కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
News
సహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
* సహజీవనం ముగియడం మాత్రమే చట్టపరంగా నేరం కాదు.. వివాహానికి ఉన్న హక్కులు స్వయంచాలకంగా వర్తించవని స్పష్టం
బీబీఎంఏ న్యూస్: న్యూఢిల్లీ
15 ఏళ్ల పాటు సహజీవనం చేసి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భాగస్వామి తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) భారత చట్టాల ప్రకారం నేరం కాదని, అయితే అది వివాహంతో సమానమైన చట్టబద్ధ బంధం కూడా కాదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధంలో భాగస్వాములు తమ ఇష్టప్రకారమే కలిసి ఉండవచ్చని, అదే విధంగా విడిపోవచ్చని వ్యాఖ్యానించింది. కేవలం సహజీవనం ముగిసిందనే కారణంతో కోర్టు భాగస్వామిని తిరిగి కలిసి ఉండేలా ఆదేశించలేదని స్పష్టం చేసింది. అయితే ప్రతి కేసు దాని ప్రత్యేక పరిస్థితులు, వర్తించే చట్టాల ఆధారంగా నిర్ణయించబడుతుందని కూడా న్యాయస్థానం పేర్కొంది. లివ్-ఇన్ సంబంధాలపై ఇప్పటికే ఉన్న చట్టపరమైన రక్షణలు, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మహిళలకు, పిల్లలకు లభించే హక్కులు వేర్వేరు చట్టాల ప్రకారం పరిశీలించబడతాయని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
News
చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
జూలై 5న హైదరాబాద్‌లో ‘అనిత ఓ అనిత’ 20 ఏళ్ల వేడుకల
భూపాలపల్లి, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ప్రముఖ సినీ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ ఆహ్వాన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీపతి రాము, డప్పు సత్తి, బండి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ‘అనిత ఓ అనిత’ పాట రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. ప్రేమికులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల సంగీతాభిమానులను ఆకట్టుకున్న ఈ ఫోక్ గీతం తెలుగు ఫోక్ సంగీతంలో ప్రేమ పాటలకు కొత్త దారిని చూపిందన్నారు. విడుదలై 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పాట రచయితలు, గాయకులు, గాయని అనిత నాగరాజ్‌తో కలిసి జూలై 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాటల రచయితలు, గాయకులు, సంగీతాభిమానులు, ఫోక్ కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
ACB4 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News2 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News23 hours agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
