Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

నిర్మల్ జిల్లాను వరించిన‘జల సంచాయ్ జనభాగిదారి’ అవార్డు

Published

on

నిర్మల్ జిల్లాను వరించిన‘జల సంచాయ్ జనభాగిదారి’ అవార్డు

 

అధికారులు, ప్రజా భాగస్వామ్యం కృషికి గుర్తింపు

 

బిబిఎంఏ న్యూస్/ నిర్మల్: నవంబర్ 22

 

నిర్మల్: జిల్లాకు రాష్ట్ర స్థాయి ‘జల సంచాయ్–జనభాగిదారి’ అవార్డు లభించడం అధికారులు, స్థానిక ప్రజల సమిష్టి కృషికి నిదర్శనం అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అభినందన సభలో తెలిపారు.

భూగర్భ జల సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ కార్యక్రమాలలో స్థానికులతో సహకారం, ప్రజా భాగస్వామ్యం ప్రధాన పాత్ర వహించిందని. అవార్డు సాధనలో సేవలందించిన అధికారులు సన్మానించబడ్డారు.

అంతేకాకుండా, మండలాల్లో నీటి నిల్వలను మెరుగుపరచేందుకు 18 ఫాగింగ్ యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఎర్పీ డబ్ల్యూ.ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ అవార్డు, ప్రభుత్వ కార్యసాధనల్లో సమూహ కృషి, పౌర భాగస్వామ్యం కీలకమని, భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన నీటి సంరక్షణ పనులకు ప్రేరణనిస్తుంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి

Published

on

కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

సహజీవనానికి వివాహ హోదా లేదు..  సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 

Published

on

* సహజీవనం ముగియడం మాత్రమే చట్టపరంగా నేరం కాదు.. వివాహానికి ఉన్న హక్కులు స్వయంచాలకంగా వర్తించవని స్పష్టం

బీబీఎంఏ న్యూస్: న్యూఢిల్లీ

15 ఏళ్ల పాటు సహజీవనం చేసి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భాగస్వామి తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) భారత చట్టాల ప్రకారం నేరం కాదని, అయితే అది వివాహంతో సమానమైన చట్టబద్ధ బంధం కూడా కాదని పేర్కొంది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధంలో భాగస్వాములు తమ ఇష్టప్రకారమే కలిసి ఉండవచ్చని, అదే విధంగా విడిపోవచ్చని వ్యాఖ్యానించింది. కేవలం సహజీవనం ముగిసిందనే కారణంతో కోర్టు భాగస్వామిని తిరిగి కలిసి ఉండేలా ఆదేశించలేదని స్పష్టం చేసింది. అయితే ప్రతి కేసు దాని ప్రత్యేక పరిస్థితులు, వర్తించే చట్టాల ఆధారంగా నిర్ణయించబడుతుందని కూడా న్యాయస్థానం పేర్కొంది. లివ్-ఇన్ సంబంధాలపై ఇప్పటికే ఉన్న చట్టపరమైన రక్షణలు, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మహిళలకు, పిల్లలకు లభించే హక్కులు వేర్వేరు చట్టాల ప్రకారం పరిశీలించబడతాయని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

Continue Reading

News

చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ

Published

on

జూలై 5న హైదరాబాద్‌లో ‘అనిత ఓ అనిత’ 20 ఏళ్ల వేడుకల

భూపాలపల్లి, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ప్రముఖ సినీ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ ఆహ్వాన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీపతి రాము, డప్పు సత్తి, బండి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ‘అనిత ఓ అనిత’ పాట రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. ప్రేమికులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల సంగీతాభిమానులను ఆకట్టుకున్న ఈ ఫోక్ గీతం తెలుగు ఫోక్ సంగీతంలో ప్రేమ పాటలకు కొత్త దారిని చూపిందన్నారు. విడుదలై 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పాట రచయితలు, గాయకులు, గాయని అనిత నాగరాజ్‌తో కలిసి జూలై 5న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాటల రచయితలు, గాయకులు, సంగీతాభిమానులు, ఫోక్ కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Continue Reading

Trending