Politics
విదేశీ విద్య పథకం
విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యాను. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేయడానికి విధివిధానాలు రూపొందించాలని చెప్పాను. స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం కింద సాయం అందిస్తాము. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నారు. స్వదేశంలో 88,196 మంది ఉన్నత చదువులు చదువుతున్నట్లు అధికారులు చెప్పారు. విదేశీ విద్య పథకం ఏ విధంగా అమలు చేయాలన్న విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించాను.
News
బీసీ విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్డీవోకు వినతి
కరీంనగర్, జూలై 3 (బీబీఎంఏ న్యూస్):
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ధర్నా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 6న కరీంనగర్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్, సోషల్ మీడియా ఇన్‌చార్జి సమీర్, జిల్లా కన్వీనర్ సాయి యాదవ్, కమిటీ సభ్యులు తిరుపతి, అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
News
మహాముత్తారం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ ఆకస్మిక తనిఖీ
సాదాబైనమా, భూ సేకరణ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష – పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం
మహాముత్తారం, జూలై 2 (బిబిఎంఏ న్యూస్):
కాటారం ఆర్‌డీఓ మహాముత్తారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాదాబైనమా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణకు సంబంధించిన పిటిషన్ల విచారణ పురోగతిని పరిశీలించారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందేలా ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, విచారణల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు.
News
ఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
మందమర్రి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీఆర్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత ఎం.డి. మునీర్ రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా విశేష సేవలు అందిస్తోందని అన్నారు. జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డును అందుకున్న ఎం.డి. మునీర్ అభినందనీయులని కొనియాడారు.
రచయితగా కూడా తన ప్రతిభను చాటుకుంటూ పుస్తక రచన ద్వారా సమాజానికి ఉపయోగపడే అంశాలను అందించడం ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. పుస్తకాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, యువతలో చదివే అలవాటును పెంపొందించేందుకు ఇలాంటి రచనలు దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, సాహితీవేత్తలు, అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
ACB4 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
News3 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News3 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
News3 weeks agoఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
-
News2 days agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
News1 day agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
Telangana3 weeks agoఏసీబీ వలలో ఎంపీడీఓ రాధిక.. రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
