Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

చిన్నకల్వలలో ఘోర రోడ్డు ప్రమాదంలో రాపెళ్లి రాజేశం మృతి

Published

on

చిన్నకల్వలలో ఘోర రోడ్డు ప్రమాదంలో రాపెళ్లి రాజేశం మృతి

 

బిబిఎంఏ న్యూస్ /సుల్తానాబాద్

మండలం చిన్నకల్వల స్టేజి వద్ద నిన్న సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నకల్వల గ్రామానికి చెందిన రాపెళ్లి రాజేశం, తన ఇంటి చెత్తను రోడ్డు పక్కన ఉన్న డంపులో పారబోసి తిరిగి ఇంటికి వెళ్తుండగా, కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు అతి వేగంతో వస్తున్న టీఎస్ 22 జె 6966 కార్ అతనిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజేశం అక్కడికక్కడే మృతి చెందాడు.

 

సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని, సాక్ష్యాలు సేకరించి ప్రమాద కారణాలను గుర్తించేందుకు పరిశీలనలు చేపట్టారు. పోలీసులు స్థానిక ప్రజల, వాహనదారుల సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

 

ప్రాంతసభ్యులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద రహిత రోడ్డు, వేగ నియంత్రణపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్థానికులకు హెచ్చరించారు.

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

రూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్‌ మోటపలుకుల వెంకట్ పై కేసు

Published

on

కోరుట్లలో కార్ కన్సల్టెన్సీకి మోసం… రూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్‌ మోటపలుకుల వెంకట్ పై కేస నమోదు

బిబిఎంఏ న్యూస్ / కోరుట్ల : ఏప్రిల్ 2:

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ యాజమాన్యాన్ని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెల్గటూరు మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన మోటపలుకుల వెంకట్ అనే వ్యక్తి రిపోర్టర్‌గా చలామణి అవుతూ జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ వద్ద రెండు కార్లు తీసుకున్నట్లు సమాచారం.

మొదటగా తీసుకున్న హ్యుందాయ్ క్రెటా కారుకు సంబంధించి రూ.2.5 లక్షలు, అనంతరం తీసుకున్న గ్రాండ్ ఐ-10 కారుకు రూ.2.15 లక్షలు చెల్లించాల్సి ఉండగా మొత్తం రూ.4.65 లక్షలు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు కన్సల్టెన్సీ యాజమాన్యం తెలిపింది.

డబ్బులు అడగడానికి వెళ్లిన జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ యజమానులు చెక్కపల్లి నవీన్, కుర్ర ఆంజనేయులను తాను రిపోర్టర్‌నని, డబ్బులు అడిగితే మీ సంగతి చూస్తానని మోటపలుకుల వెంకట్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ మేరకు చెక్కపల్లి నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మోటపలుకుల వెంకట్‌పై ఛీటింగ్, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Continue Reading

News

BBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు

Published

on

By

BBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు

BBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు

ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా స్మైల్ స్పెషల్ స్కూల్ ఆధ్వర్యంలో అవగాహన, ఆమోదం, సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైన ప్రతిభతో, సామర్థ్యంతో ఉండే వ్యక్తి. వారి ప్రత్యేకతలను గౌరవిస్తూ, ప్రేమ, సహనం, అర్థం చేసుకునే మనస్తత్వంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆటిజం ఒక వ్యాధి కాదు, అది ఒక భిన్నమైన ప్రపంచాన్ని చూసే విధానం మాత్రమే. కాబట్టి వారిని మార్చే ప్రయత్నం కాకుండా, వారితో ఉండడం, వారిని అర్థం చేసుకోవడం సమాజ బాధ్యత. “లేబుల్ కాదు, సామర్థ్యాన్ని చూడాలి” అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు. ప్రతి ఒక్కరూ కలిసి సహకరిస్తే సమానత్వంతో కూడిన మంచి సమాజాన్ని నిర్మించవచ్చు.

పాఠశాల నిర్వహణ:

శ్రీమతి పి. లక్ష్మి నీలిమ – స్థాపకురాలు మరియు చైర్మన్
శ్రీ ఉదయ్ ఐతరాజు – డైరెక్టర్
శ్రీమతి దివ్య గోకుల్ – ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్
శ్రీమతి శ్రావణి రావీతి – వైస్ ప్రిన్సిపల్

Continue Reading

News

BBMA POLICE E:NEWS// ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా బాధ్యతలు స్వీకరణ

Published

on

By

BBMA POLICE E:NEWS// ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా బాధ్యతలు స్వీకరణ

BBMA POLICE E:NEWS// ఆదిలాబాద్ బిసి అభివృద్ధి అధికారిగా సోనియా బాధ్యతలు స్వీకరణ

Adilabad జిల్లా బిసి అభివృద్ధి అధికారిగా ధారావత్ సోనియా నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ Rajarshi Shah గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖ కార్యకలాపాలపై చర్చించగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.

పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

జిల్లాలో బిసి వర్గాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు సేవాభావంతో విధులు నిర్వహించాలని సోనియాకు మార్గనిర్దేశం చేశారు.

Continue Reading

Trending