Telangana
కరీంనగర్ జిల్లా రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి,కలెక్టర్ పమేలా సత్పతి తో కలసి
కరీంనగర్ జిల్లా విద్యా రంగ అభివృద్ధి కీ తీసుకుంటున్న చర్యలపైన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి,కలెక్టర్ పమేలా సత్పతి తో కలసి
సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం బోధన స్నేహిత, కాన్షియస్ క్లబ్ ల ఏర్పాటు, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లు, విటమిన్ గార్డెన్స్ ఏర్పాటు, ఇండియన్ సైన్ లాంగ్వేజ్, ఒలంపియాడ్, టెడ్ ,సమ్మర్ క్యాంప్ లతో పాటు వివిధ రకాల కార్యక్రమలపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలపై అయన సంతృప్తి వ్యక్తం చేశారు
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
News
సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి
సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి
బీబీఎంఏ న్యూస్ / సుల్తానాబాద్, ఏప్రిల్ 14
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుల్తానాబాద్‌కు చేరుకున్న ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి దేశానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News
నంది మేడారం కోర్ట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అడ్వకేట్స్ అసోసియేషన్
బీబీఎంఏ న్యూస్ / ధర్మారం, ఏప్రిల్ 14,
పెద్దపల్లి జిల్లా నందిమ్యాడారం కోర్టు ఆవరణలో అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను అడ్వకేట్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలను వక్తలు స్మరించారు.
అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి బొట్ల లక్ష్మీనర్సయ్య, సంయుక్త కార్యదర్శి ఆకారి రాజేశం, కోశాధికారి నూనే సత్యనారాయణ, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శి సంపత్ భీమారపు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నారా అశోక్ రెడ్డి, మహిళా న్యాయవాది రాగుల రజిత, కోర్టు పోలీస్ సంతోష్, కోర్టు ప్రాసెస్ సర్వర్ తేజతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చివరగా అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని ప్రతిజ్ఞ చేశారు.
News
కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి అవమానం: కోరుకంటి
కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి అవమానం: కోరుకంటి చందర్
బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి
గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా గుండాల పాలన కొనసాగుతోందని విమర్శించారు.
ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తూ, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు “డైవర్షన్ పాలిటిక్స్”లో భాగంగానే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
-
News2 weeks agoరూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్ మోటపలుకుల వెంకట్ పై కేసు
-
Telangana4 weeks agoరాష్ట్రస్థాయి గౌరవం అందుకున్న కవి శ్రీపతి రాము
-
Police News2 weeks ago🚨 BBMA POLICE e:NEWS – మా రిపోర్టర్లు & సహచర మీడియా జోలికి వస్తే తాట తీస్తాం
-
Police News2 weeks agoBBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు
-
india3 weeks agoమార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
-
Politics3 weeks agoBBMA POLICE E:NEWS// నెల్లూరు చిల్లకూరులో టీడీపీ నాయకుల రాసలీలలు కలకలం!!
-
Telangana4 weeks agoత్వరలో డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి ప్రకటన
-
News2 weeks agoజయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం
