Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక దారి మళ్లింపులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

Published

on

 

బిబిఎంఏ న్యూస్ | జనవరి 15, 2026

సంక్రాంతి పండగ అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు భారీగా వాహనాలు తరలివచ్చే అవకాశాల నేపథ్యంలో, జాతీయ రహదారి–65పై ట్రాఫిక్ రద్దీ నివారణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దారి మళ్లింపు చర్యలు చేపట్టింది. చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు.

గుంటూరు, మాచర్ల, నల్లగొండ, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. ఈ దారి మళ్లింపులతో ఎన్‌హెచ్–65పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు సురక్షితంగా, సాఫీగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

పండగ రోజుల్లో కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలతో నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శనతో విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన

Published

on

బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శనతో విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన

 

మంథని, (బిబిఎంఏ న్యూస్) మార్చి 28:

జడ్పీహెచ్ఎస్ ఏక్లాస్పూర్ పాఠశాల విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా బసంత్ నగర్‌లోని కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలో సిమెంట్ తయారీకి ఉపయోగించే ఐరన్, జిప్సం వంటి రా మెటీరియల్స్ క్రషింగ్ విధానం, బొగ్గుతో హీటింగ్ ప్రక్రియ, తుది సిమెంట్ తయారీ దశలను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే సిమెంట్ బ్యాగుల నింపడం, గూడ్స్ రైళ్లలో లోడింగ్ చేసే ఆటోమేటిక్ విధానాన్ని కూడా అవగాహన చేసుకున్నారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు సిమెంట్ తయారీపై ప్రాయోగిక జ్ఞానం సంపాదించారు. హెడ్ మాస్టర్ జి. జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంతోష్, డాక్టర్. దొమ్మటి రవి, సుచిత్ర రాజశేఖర్, అన్నం శ్రీనివాస్, మంజుల, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

End

Continue Reading

Telangana

భద్రాచలం వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు..

Published

on

భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

బీబీఎంఏ న్యూస్ / భద్రాచలం / మార్చి 28:

శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వేదికగా మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాచలం పట్టణం అంతా రామనామ స్మరణతో మార్మోగింది.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Continue Reading

india

మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

Published

on

13 మంది సజీవదహనం 🔥

బీబీఎంఏ న్యూస్ / మార్కాపురం

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది సజీవదహనమయ్యారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాయవరం సమీపంలోని క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. కొందరు కిటికీలు పగులగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకున్న 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

Trending