Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

రైతు శ్రేయస్సే లక్ష్యం: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Published

on

రైతు శ్రేయస్సే లక్ష్యం: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

బీబీఎంఏ న్యూస్ | పెద్దపల్లి | మార్చి 25

రైతు శ్రేయస్సే లక్ష్యంగా వ్యవసాయ శాఖ అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ పనితీరుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 79 శాతం ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తయిందని, దీనిని 85 శాతానికి పెంచాలని ఎం.ఏ.ఓలు, ఏ.ఈ.ఓలకు ఆదేశించారు. పీఎం కిసాన్ పథకానికి రైతుల ఈ-కేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. రైతు బీమా పథకం అమలులో వేగం పెంచి, రైతు మరణించిన కుటుంబాలకు త్వరగా సహాయం అందేలా చూడాలని అన్నారు.
వానాకాలం సీజన్‌కు అవసరమైన యూరియా సరఫరాపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా నూతన సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

భద్రాచలం వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు..

Published

on

భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

బీబీఎంఏ న్యూస్ / భద్రాచలం / మార్చి 28:

శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వేదికగా మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాచలం పట్టణం అంతా రామనామ స్మరణతో మార్మోగింది.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Continue Reading

india

మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

Published

on

13 మంది సజీవదహనం 🔥

బీబీఎంఏ న్యూస్ / మార్కాపురం

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది సజీవదహనమయ్యారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాయవరం సమీపంలోని క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. కొందరు కిటికీలు పగులగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకున్న 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

News

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన టి. జీవన్ రెడ్డి

Published

on

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి?

 

బిబిఎంఏ న్యూస్ 

జగిత్యాల జిల్లా, మార్చి 25:

జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి బుధవారం అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన రాజకీయ బంధానికి ఆయన తెరదించారు. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి ముగింపు

టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో సుమారు 40 సంవత్సరాలుగా అనుబంధం కొనసాగించారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసిన ఆయన ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్టీ కీలక నేతగా పనిచేసి జగిత్యాల జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు గట్టి అనుచర వర్గం ఉంది.

అయితే ఇటీవల కాలంలో పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని జీవన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

చివరి వరకు బుజ్జగించిన కాంగ్రెస్ అధిష్టానం

జీవన్ రెడ్డి రాజీనామా విషయంపై పార్టీ అధిష్టానం చివరి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు.

జగిత్యాలలో తన అనుచరులు, కార్యకర్తలతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం ఆయన అధికారికంగా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అనంతరం తన రాజీనామా లేఖను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు పీసీసీ కార్యాలయాలకు పంపారు.

“20 నెలలుగా మానసిక వేదన” — జీవన్ రెడ్డి

రాజీనామా అనంతరం జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా నాకు సంతోషం లేకుండా చేశారు. గత 20 నెలలుగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదు. ఆత్మగౌరవం లేని చోట కొనసాగడం కంటే తప్పుకోవడమే మంచిదని భావించాను” అని తెలిపారు.

జగిత్యాల రాజకీయాల్లో ప్రభావం

జీవన్ రెడ్డి రాజీనామా జగిత్యాల రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయనకు ఉన్న బలమైన కేడర్, గ్రామీణ స్థాయి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహంపై ప్రభావం పడే అవకాశముంది.

తదుపరి రాజకీయ అడుగు ఏంటి?

ప్రస్తుతం జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్‌లో చేరుతారా?

బీజేపీ వైపు చూస్తారా?

లేక స్వతంత్రంగా రాజకీయ ప్రయాణం కొనసాగిస్తారా?

అన్న అంశాలపై స్పష్టత లేదు. అయితే త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

రాజకీయ వర్గాల్లో చర్చ

జీవన్ రెడ్డి రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉందని చర్చ సాగుతోంది.

మొత్తంగా, టి. జీవన్ రెడ్డి రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది.

Continue Reading

Trending