Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Politics

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్స్ ముందంజ

Published

on

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్స్ ముందంజ

 

  • హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయింది. మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్స్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగాడు. చివరి రౌండ్‌లో కూడా ఆయన సుమారు 9,000 ఓట్ల మెజారిటీతో విజయానికి దగ్గరగా ఉన్నారని సమాచారం. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెనుకబడింది. మొత్తం ఓటు హాజరు సుమారు 48.5%. ఈ ఫలితం తర్వాత రాష్ట్ర రాజకీయాలలో, ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని GHMC ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

 

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి

Published

on

సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి

బీబీఎంఏ న్యూస్ / సుల్తానాబాద్, ఏప్రిల్ 14

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుల్తానాబాద్‌కు చేరుకున్న ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి దేశానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి అవమానం: కోరుకంటి

Published

on

కేసీఆర్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి అవమానం: కోరుకంటి చందర్

బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి

గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా గుండాల పాలన కొనసాగుతోందని విమర్శించారు.

ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తూ, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు “డైవర్షన్ పాలిటిక్స్”లో భాగంగానే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.

Continue Reading

News

క్యాతనపల్లి చైర్‌పర్సన్‌గా గొడిసల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్నిక

Published

on

క్యాతనపల్లి చైర్‌పర్సన్‌గా గొడిసల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత ఎన్ని

బిబిఎంఏ న్యూస్ /క్యాతనపల్లి

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా గొడిసల సంధ్యారాణి (బిఅర్ఎస్) ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా మిట్టపల్లి సరిత (సిపిఐ ) ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లకు అధికారులు ధృవపత్రాలు అందజేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాతనపల్లి అభివృద్ధికి కృషి చేస్తామని నూతన ప్రజాప్రతినిధులు తెలిపారు.

Continue Reading

Trending