News
తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఈటెలకు ఆహ్వానం
బిబిఎంఏ న్యూస్ హైదరాబాద్ జూలై 19న తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మేడ్చల్ – మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్‌ను సంఘం ప్రతినిధులు బుధవారం ఆహ్వానించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోర్రిగల శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి పాతకోటి ఉమా, రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం చంద్రమౌళి, ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి మాదిరె నాగరాజు, ఉప్పల్ మండల నాయకులు శ్రీనన్న, ఉప్పలయ్య పాల్గొన్నారు. సంఘం ప్రతినిధుల ఆహ్వానాన్ని ఈటెల రాజేందర్ సాదరంగా స్వీకరించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
crime
రూ.60 వేల లంచం కేసులో ఆదిలాబాద్ ఇరిగేషన్ ఈఈ, ఏఈ ఏసీబీ వలలో
ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం నిర్వహించిన ట్రాప్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ (AO-1), అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్ (AO-2) లంచం కేసులో పట్టుబడ్డారు.
సోనాల్ గ్రామంలో వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం నిర్మించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.60 వేల లంచం డిమాండ్ చేసి, ఏఈ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ వద్ద నుంచి రూ.60 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు అధికారులను కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించింది. ప్రజాసేవకులు లంచం కోరితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
News
ఎస్‌వీ జూలాజికల్ పార్క్‌ను సందర్శించిన అసెంబ్లీ వన్యప్రాణి–పర్యావరణ పరిరక్షణ కమిటి
చంద్రగిరి అసెంబ్లీ వన్యప్రాణి,పర్యావరణ పరిరక్షణ కమిటీ ఎస్‌వీ జూలాజికల్ పార్క్‌ను సందర్శించింది. కమిటీ చైర్మన్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, సభ్యులు జి. శంకర్రావు, వి. నరేంద్ర వర్మ రాజుతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అటవీ శాఖ అధికారులు కమిటీ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జూ పార్క్‌లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, 3,100 ఎకరాల విస్తీర్ణంలో ఆసియాలోనే అతిపెద్ద జూలాజికల్ పార్క్ చంద్రగిరి నియోజకవర్గంలో ఉండడం అదృష్టకరమని పేర్కొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు జూ పార్క్‌ను పరిశీలించి సందర్శకులకు అందుతున్న సౌకర్యాలు, జంతువులకు అందిస్తున్న ఆహారం, సంరక్షణ ఏర్పాట్లపై ఆరా తీశారు. బ్యాటరీ వాహనాలు, సైకిళ్లు, తాగునీటి సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
జూకు సందర్శకులు తక్కువగా రావడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.18 కోట్ల ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటీ వెల్లడించింది. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు కల్పించి జూను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News
జూలై 19న తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్, జూలై 15 బీబీఎంఏ న్యూస్ : తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 19న(ఆదివారం) హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో ఉన్న వంజరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు జోర్రిగల శ్రీనివాస్ అధ్యక్షతన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేదరి కులాన్ని డీనోటిఫైడ్ ట్రైబ్స్(డిఎన్టీ) జాబితాలో చేర్చిన నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే ఉప్పల్ బగాయత్‌లోని మేదరి ఆత్మగౌరవ భవనం నిర్మాణ స్థలం అభివృద్ధి, అనుబంధ విభాగాల ద్వారా మేదర్ల సంక్షేమం, సంఘం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, ప్రచార కార్యదర్శులు, గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర సంఘం సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల ముఖ్య కార్యవర్గ సభ్యులు, మేదరి కుల దేవతల దేవాలయాల నిర్వాహకులు హాజరుకావాలని సంఘం రాష్ట్ర నాయకత్వం కోరింది. ఈ సమావేశానికి ఆహ్వానితులైన వారంతా నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు జోర్రిగల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్, రాష్ట్ర కోశాధికారి పాతకోటి ఉమా, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్ విజ్ఞప్తి చేశారు.
-
crime1 week agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
crime2 days ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana5 days agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News2 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment3 days agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News5 days agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News4 days agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
-
News2 weeks agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
