Police News
BBMA POLICE E:NEWS// గంగవరం లో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు అదుపులోకి
BBMA POLICE E:NEWS//
గంగవరం లో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు అదుపులోకి
ప్రెస్ నోట్.
క్రైమ్ నం. 21/2026
U/s 65(2) భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు సెక్షన్ 5(m) R/w 6, POCSO చట్టం, 2012 of న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ – విశాఖపట్నం.
18.02.2026 న సాయంత్రం 4.15 గంటల నుండి 5.00 గంటల మధ్య, గంగవరం పరిధిలోని రామాలయం వీధి, పెదగంట్యాడ, విశాఖపట్నం నగరంలో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటనకు సంబంధించి న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 21/2026 గా కేసు నమోదు చేయబడింది.
వివరాలలోకి వెళితే, ఆరోపితుడు వయస్సు సుమారు 17 సంవత్సరాల 11 నెలల 11 రోజులు బాధిత కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి. 18.02.2026 న సుమారు సాయంత్రం 4.00 గంటల సమయంలో బాధిత బాలిక ఇంటికి వచ్చి, సమీపంలోని కిరాణా దుకాణానికి తీసుకెళ్లి బిస్కెట్లు కొనిపెడతానని నమ్మబలికి, సుమారు 4.15 గంటలకు మైనర్ బాలికను తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగిక దాడి జరిపి, సుమారు సాయంత్రం 5.00 గంటల సమయంలో తిరిగి ఇంటి వద్ద వదిలివేసి అక్కడి నుండి పరారయ్యాడు.
కొంతసమయం తరువాత బాలిక కుటుంబ సభ్యులు ఆమె ఏడుస్తూ, తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు గమనించి, బాలికపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. దీనిపై మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై కేసు నమోదు చేయబడింది.
ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, అవసరమైన సాక్ష్యాలు సేకరించి, బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్యాప్తు చర్యలలో భాగంగా ఆరోపితుడు****** తండ్రి పేరు కొండబాబు, వాడబలిజ వర్గానికి చెందినవాడు, 19.02.2026 న ఉదయం 11.30 గంటలకు గంగవరం ఆటో స్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకోబడ్డాడు. అనంతరం జ్యువినల్ మెజిస్ట్రేట్ గారి వద్ద హాజరుపరచి అనంతరం బాలల సంరక్షణ కేంద్రం కు తరలించడం అయినది
ఈ కేసు దర్యాప్తు హార్బర్ డివిజన్ ఎ.సి.పీ గారి పర్యవేక్షణలో, న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి సహకారంతో కొనసాగుతోంది.
గమనిక: POCSO చట్టం నిబంధనల ప్రకారం బాధిత బాలిక యొక్క వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచబడినవి.
Police News
POLICE E:NEWS BBMA// జోగిపేట సబ్ జైల్ ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులపై ఐజీ ఎం. శ్రీనివాస్ పరిశీలన
POLICE E:NEWS BBMA// జోగిపేట సబ్ జైల్ ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులపై ఐజీ ఎం. శ్రీనివాస్ పరిశీలన
జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా పరిధిలోని జోగిపేట సబ్ జైల్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను ఐజీ ఎం. శ్రీనివాస్ సందర్శించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి, నిర్మాణం వేగవంతంగా మరియు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగాలని సూచించారు. విదేశీయులు సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
నివాస వసతి, భద్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు వంటి అంశాల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్సిట్ హోంను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణ పనులలో పారదర్శకత మరియు నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, డీసీపీ కృష్ణ చైతన్య, డీఎస్పీ సత్తయ్య గౌడ్, జోగిపేట ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Police News
POLICE NEWS BBMA// గండీడ్ KGBV పాఠశాలలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ – విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
POLICE NEWS BBMA// గండీడ్ KGBV పాఠశాలలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మిక తనిఖీ – విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
బుధవారం మహమ్మదాబాద్ మండలం గండీడ్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV) పాఠశాలలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా IAS ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య పరిస్థితులు, పాఠశాల మౌలిక వసతులపై సమగ్రంగా పరిశీలించారు.
తరగతి గదుల్లో బోధన విధానాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది, భోజన ఏర్పాట్లు, శుభ్రత వంటి అంశాలను తనిఖీ చేసి, పోషకాహారం సరైన విధంగా అందుతున్నదా అనే విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు.
పాఠశాలలో మెరుగైన బోధన, సౌకర్యాలు, పరిశుభ్రత మరియు విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Police News
POLICE NEWS BBMA// TCS నాసిక్ కేసులో సంచలన మలుపు – కార్పొరేట్ కుంభకోణం నుంచి జాతీయ భద్రత కోణం వరకు దర్యాప్తు
POLICE NEWS BBMA// TCS నాసిక్ కేసులో సంచలన మలుపు – కార్పొరేట్ కుంభకోణం నుంచి జాతీయ భద్రత కోణం వరకు దర్యాప్తు
నాసిక్‌లో వెలుగుచూసిన TCS సంబంధిత కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. ప్రారంభంలో కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్, బలవంతపు మత మార్పిడుల ఆరోపణలతో ప్రారంభమైన ఈ వ్యవహారం, ఇప్పుడు మరింత విస్తృత దర్యాప్తుకు దారితీసింది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో కీలకంగా భావిస్తున్న హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్‌పై నిందితులను రక్షించడంలో పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, కొన్ని వర్గాలు ఈ కేసును ఇతర తీవ్ర నేరాలు లేదా నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారికంగా నిర్ధారించిన వివరాల మేరకే విచారణ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ఘటన కార్పొరేట్ సంస్థల్లో మహిళల భద్రత, పారదర్శక వ్యవస్థల అవసరంపై చర్చకు దారితీసింది. బాధితులకు న్యాయం చేయడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
-
News2 weeks agoరూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్ మోటపలుకుల వెంకట్ పై కేసు
-
Telangana4 weeks agoరాష్ట్రస్థాయి గౌరవం అందుకున్న కవి శ్రీపతి రాము
-
Police News1 week ago🚨 BBMA POLICE e:NEWS – మా రిపోర్టర్లు & సహచర మీడియా జోలికి వస్తే తాట తీస్తాం
-
Police News2 weeks agoBBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు
-
india3 weeks agoమార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
-
Politics3 weeks agoBBMA POLICE E:NEWS// నెల్లూరు చిల్లకూరులో టీడీపీ నాయకుల రాసలీలలు కలకలం!!
-
Telangana4 weeks agoత్వరలో డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి ప్రకటన
-
News2 weeks agoజయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం
