Connect with us

Telangana

40వ డివిజన్ లో బి ఆర్ ఎస్ అభ్యర్థి కజాంపురం జయప్రద రాజేందర్ విజయం

Published

on

40వ డివిజన్ లో బి ఆర్ ఎస్ అభ్యర్థి కజాంపురం జయప్రద రాజేందర్ విజయం

బిబిఎంఏ న్యూస్ / రామగుండం

రామగుండం మున్సిపాలిటీ 40వ డివిజన్‌లో జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి కాజాంపురం జయప్రద రాజేందర్ 803 ఓట్ల రాగ సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆడెపు తార కి 516 ఓట్లు వచ్చాయి. బిఆర్ఎస్ అభ్యర్థి 287 మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో డివిజన్‌లో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telangana

సెంటినరీ కాలనీలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య..

Published

on

సెంటినరీ కాలనీలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య..

 

బిబిఎంఏ న్యూస్ | రామగిరి

రామగిరి మండలం పరిధిలోని సెంటినరీ కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఉన్న సింగరేణి కమ్యూనిటీ హాల్ సమీపంలో బేగంపేట్ గ్రామానికి చెందిన మోలుగురి కోమురయ్య (58) హత్యకు గురయ్యారు.

పోలీసుల వివరాల ప్రకారం, నారాయణపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య స్థానికంగా జరిగిన వివాహ కార్యక్రమానికి సెంటినరీ కాలనీకి వచ్చాడని తెలుసుకున్న బుర్ర రాజకోమురయ్య పాత కక్షల నేపథ్యంలో సత్తయ్యపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నంలో సత్తయ్యకు చేతికి గాయాలయ్యాయి.

సత్తయ్యను రక్షించేందుకు వచ్చిన అతని అన్న కోమురయ్యపై నిందితుడు విచక్షణ రహితంగా దాడి చేయడంతో కోమురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

News

BBMA మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు

Published

on

By

BBMA NEWS మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు

🔴 𝗕𝗕𝗠𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘 𝗘:𝗡𝗘𝗪𝗦

 

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.

 

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై దిశానిర్దేశం చేశాను. పౌరులకు అందించాల్సిన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశాను.

 

మూడు కార్పొరేషన్ల పరిధిలో వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించాను. త్వరలో ప్రతి జోన్‌లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించాను. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పాను.

 

#GHMC

#MunicipalAdministration

#UrbanDevelopment

#PrajaPrabhutvam

Continue Reading

Telangana

రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపెల్లి ఎల్లయ్యలు ఎన్ని

Published

on

రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపెల్లి ఎల్లయ్యలు ఎన్నిక
రామగుండంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపెల్లి ఎల్లయ్య ఎన్నికయ్యారు.
ఈ ఎన్నిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆశీస్సులతో పాటు పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఈ ఎన్నిక ప్రక్రియ విజయవంతంగా పూర్తైనట్లు నాయకులు వెల్లడించారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యలు మాట్లాడుతూ… రామగుండం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రహదారుల అభివృద్ధి, పారిశుధ్య సేవల బలోపేతం, పట్టణ మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వేగవంతంగా పరిష్కరించే విధంగా కార్పొరేషన్‌లో ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌లకు అభినందనలు తెలిపారు. రామగుండం అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి నగరాన్ని ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.

Continue Reading

Trending