Telangana
పెద్దపల్లి మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ విజయం
బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి:
పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 36 వార్డులకు గాను కాంగ్రెస్ 27 స్థానాలు దక్కించుకుంది. భారత రాష్ట్ర సమితి 1, భారతీయ జనతా పార్టీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 2 స్థానాలు సాధించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.
Telangana
సెంటినరీ కాలనీలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య..
సెంటినరీ కాలనీలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య..
బిబిఎంఏ న్యూస్ | రామగిరి
రామగిరి మండలం పరిధిలోని సెంటినరీ కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఉన్న సింగరేణి కమ్యూనిటీ హాల్ సమీపంలో బేగంపేట్ గ్రామానికి చెందిన మోలుగురి కోమురయ్య (58) హత్యకు గురయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం, నారాయణపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య స్థానికంగా జరిగిన వివాహ కార్యక్రమానికి సెంటినరీ కాలనీకి వచ్చాడని తెలుసుకున్న బుర్ర రాజకోమురయ్య పాత కక్షల నేపథ్యంలో సత్తయ్యపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నంలో సత్తయ్యకు చేతికి గాయాలయ్యాయి.
సత్తయ్యను రక్షించేందుకు వచ్చిన అతని అన్న కోమురయ్యపై నిందితుడు విచక్షణ రహితంగా దాడి చేయడంతో కోమురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News
BBMA మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులతో సమీక్ష – పౌర సేవలపై కఠిన ఆదేశాలు
🔴 𝗕𝗕𝗠𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘 𝗘:𝗡𝗘𝗪𝗦
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై దిశానిర్దేశం చేశాను. పౌరులకు అందించాల్సిన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశాను.
మూడు కార్పొరేషన్ల పరిధిలో వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించాను. త్వరలో ప్రతి జోన్‌లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించాను. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పాను.
#GHMC
#MunicipalAdministration
#UrbanDevelopment
#PrajaPrabhutvam
Telangana
రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపెల్లి ఎల్లయ్యలు ఎన్ని
రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపెల్లి ఎల్లయ్యలు ఎన్నిక
రామగుండంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపెల్లి ఎల్లయ్య ఎన్నికయ్యారు.
ఈ ఎన్నిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆశీస్సులతో పాటు పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఈ ఎన్నిక ప్రక్రియ విజయవంతంగా పూర్తైనట్లు నాయకులు వెల్లడించారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యలు మాట్లాడుతూ… రామగుండం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రహదారుల అభివృద్ధి, పారిశుధ్య సేవల బలోపేతం, పట్టణ మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వేగవంతంగా పరిష్కరించే విధంగా కార్పొరేషన్‌లో ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌లకు అభినందనలు తెలిపారు. రామగుండం అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి నగరాన్ని ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.
-
Politics2 weeks agoP. జలంధర్ రావు (మాజీ చైర్మన్, మీడియా విభాగం – తెలంగాణ యువజన కాంగ్రెస్) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తుంది
-
News4 weeks agoవ్యాయామంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్
-
Police News1 day agoBBMA POLICE E:NEWS పోలీస్ జాగిలం “రాఖీ”కి శిక్షణ పూర్తి సర్టిఫికెట్ అందజేత
-
Telangana2 weeks agoనేడే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
-
News3 weeks agoమేడారంలో మెరిసిన సంస్కృతి తార 🌟
-
News3 weeks agoBBMA NEWS : జనాల్లోకి వన దేవత… గద్దెపైకి సమ్మక్క!
-
Police News3 days agoBBMA POLICE E:NEWS పోలీసుల్లో నూతనోత్సాహం.. క్రీడల కోలాహలం
-
News5 days agoBBMA POLICE E:NEWS // గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
