Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమిషనర్

Published

on

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమిషనర్

గోదావరిఖని, జనవరి 11:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ గోదావరిఖనిలో నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు.

గోదావరిఖనిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కార్పొరేషన్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ల పంపిణీ, వరద బాధితులు, ట్రాన్స్‌జెండర్లకు ఇంటి స్థలాల ప్రొసీడింగ్లు, సింగరేణి నిర్వాసితులకు పట్టాల పంపిణీ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా గోదావరిఖనికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమలు–ఐటీ–శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ & అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని వారు తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి

Published

on

గోదావరిఖని: గోదావరిఖని ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చైతన్య స్కూల్ టీచర్ గాజవేని వెన్నెల (26) మృతి చెందింది. ఎన్టీఆర్ నగర్ నుండి లక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూలుకు స్కూటీపై వెళ్తున్న సమయంలో గౌతమి నగర్ మూలమలుపు వద్ద వెనుక నుండి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వెన్నెల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

News

కేపీహెచ్‌బీలో బస్సు ఫైర్ ప్రయాణికులు సురక్షితం

Published

on

కేపీహెచ్‌బీ / బీబీఎంఏ న్యూస్

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

కేపీహెచ్‌బీ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మెట్రో పిల్లర్ నంబర్ 734 సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పాలకొల్లుకు వెళ్లాల్సిన ఈ బస్సు (నంబర్: NL02B9955)గా గుర్తించారు. బస్సు వెనుక భాగంలో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు.

డ్రైవర్, సిబ్బంది చాకచక్యంగా స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ట్రావెల్స్ యాజమాన్యానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Continue Reading

Telangana

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం

Published

on

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం

బిబిఎంఏ న్యూస్/హనుమకొండ, ఏప్రిల్ 14: తపస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ అంబేద్కర్ ఎస్‌డీఎల్‌సీఈలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు బత్తిని వీరస్వామి గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బత్తిని వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి సముచితమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాపగిరి శ్రీనివాసు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ఎడ్యుకేట్, ఆజిటేట్, ఆర్గనైజ్” అనే అంబేద్కర్ సందేశం సమాజ మార్పుకు మార్గదర్శకమన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మునికుంట్ల శ్రీనివాస్, అంకం సతీష్, మూల రామకృష్ణ, బిక్షపతి, సుధాకర్ రెడ్డి, రాంభూపాల్, మనోజ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending