Telangana
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు, మున్నూరు కాపులు ఐక్యత చాటాలి: రాజారాం పిలుపు
బిబిఎంఏ న్యూస్ / నస్పూర్ : జనవరి11
రానున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణా వ్యాప్తంగా బీసీలు, మున్నూరు కాపులు ఐక్యత చాటి తమ సత్తా నిరూపించాలని తెలంగాణా మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో మున్నూరు కాపు సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీపతి సురేష్ అధ్యక్షతన కులస్తుల ఆత్మీయ సమ్మేళనం, సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2026 క్యాలెండర్‌ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారాం, జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సత్తన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ తోట శ్రీనివాస్‌లు కలిసి ఆవిష్కరించారు.
రాజారాం మాట్లాడుతూ…
రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉండగా, అందులో మున్నూరు కాపులు 18 శాతం ఉన్నారని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తక్షణమే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలోనే సుమారు 70 వేల ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. మున్నూరు కాపుల ఐక్యత ద్వారానే రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధికంగా కాపు ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీపతి బాపురావు, జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News
స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
గోదావరిఖని: గోదావరిఖని ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చైతన్య స్కూల్ టీచర్ గాజవేని వెన్నెల (26) మృతి చెందింది. ఎన్టీఆర్ నగర్ నుండి లక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూలుకు స్కూటీపై వెళ్తున్న సమయంలో గౌతమి నగర్ మూలమలుపు వద్ద వెనుక నుండి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వెన్నెల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News
కేపీహెచ్‌బీలో బస్సు ఫైర్ ప్రయాణికులు సురక్షితం
కేపీహెచ్‌బీ / బీబీఎంఏ న్యూస్
హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
కేపీహెచ్‌బీ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మెట్రో పిల్లర్ నంబర్ 734 సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పాలకొల్లుకు వెళ్లాల్సిన ఈ బస్సు (నంబర్: NL02B9955)గా గుర్తించారు. బస్సు వెనుక భాగంలో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు.
డ్రైవర్, సిబ్బంది చాకచక్యంగా స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ట్రావెల్స్ యాజమాన్యానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Telangana
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం
బిబిఎంఏ న్యూస్/హనుమకొండ, ఏప్రిల్ 14: తపస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ అంబేద్కర్ ఎస్‌డీఎల్‌సీఈలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు బత్తిని వీరస్వామి గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బత్తిని వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి సముచితమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాపగిరి శ్రీనివాసు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ఎడ్యుకేట్, ఆజిటేట్, ఆర్గనైజ్” అనే అంబేద్కర్ సందేశం సమాజ మార్పుకు మార్గదర్శకమన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మునికుంట్ల శ్రీనివాస్, అంకం సతీష్, మూల రామకృష్ణ, బిక్షపతి, సుధాకర్ రెడ్డి, రాంభూపాల్, మనోజ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-
News2 weeks agoరూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్ మోటపలుకుల వెంకట్ పై కేసు
-
Telangana4 weeks agoరాష్ట్రస్థాయి గౌరవం అందుకున్న కవి శ్రీపతి రాము
-
Police News2 weeks ago🚨 BBMA POLICE e:NEWS – మా రిపోర్టర్లు & సహచర మీడియా జోలికి వస్తే తాట తీస్తాం
-
Police News2 weeks agoBBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు
-
india3 weeks agoమార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
-
News6 hours agoస్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Politics3 weeks agoBBMA POLICE E:NEWS// నెల్లూరు చిల్లకూరులో టీడీపీ నాయకుల రాసలీలలు కలకలం!!
-
Telangana4 weeks agoత్వరలో డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి ప్రకటన
