News
కొమురం భీం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఇందిరమ్మ ఇళ్ల ను పర్యవేక్షణ
కొమురం భీం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఇంద్రమ్మ ఇళ్ల ను పర్యవేక్షించారు..
బిబిఎంఏ న్యూస్ / వాంకిడి
కొమురం భీం జిల్లా వాంకిడి మండలం జైత్‌పూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఇంద్రమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిని పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్, ఎంపీడీవో మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Police News
మౌనంగా ఉండొద్దు.. ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం : సిపి అంబర్ కిషోర్ ఝా
మౌనంగా ఉండొద్దు.. ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం : సిపి అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్
రామగుండం, నవంబర్ 5 (బిబిఎంఎ న్యూస్):
మహిళల భద్రత, గౌరవ రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి మహిళా సమస్యకు పోలీసులు తక్షణ చర్యలు తీసుకుంటారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ తెలిపారు. మహిళలు, యువతులు ఎలాంటి వేధింపులు ఎదురైనా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
కమిషనరేట్ పరిధిలో రెండు షీ టీం బృందాలు పహారా కాస్తూ, స్కూల్స్, కాలేజీల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్నం చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. షీ టీమ్స్ ప్రత్యక్షంగా, ఆన్లైన్, క్యూ ఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాయని తెలిపారు.
అక్టోబర్ నెలలో షీ టీమ్‌లకు మొత్తం 69 ఫిర్యాదులు అందగా, వీటిలో 57 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 4 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు, 3 చిన్న కేసులు నమోదు కాగా, మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో షీ టీమ్స్ 53 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, 243 హాట్‌స్పాట్ ప్రాంతాలు పర్యవేక్షించాయి.
మహిళలు, విద్యార్థినులు ఎవరైనా వేధింపులు ఎదురైనా వెంటనే రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700, పెద్దపల్లి – 8712659386, మంచిర్యాల – 8712659386 లేదా డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
“మహిళల భద్రత మా బాధ్యత, షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి” అని ఆయన స్పష్టం చేశారు.
crime
దోపిడి చేసిన 24 గంటల్లో దొంగల గ్యాంగ్‌ను అరెస్ట్
దోపిడి చేసిన 24 గంటల్లో దొంగల గ్యాంగ్‌ను అరెస్ట్
బిబిఎంఏ క్రైమ్ న్యూస్:
హైదరాబాద్, నవంబర్ 4:
బేగంపేట పోలీసులు చురుకైన చర్యలతో రెండు దోపిడీ కేసులను కేవలం 24 గంటల్లో ఛేదించి, ఆరుగురు నిందితుల్లో నలుగురు యువకులను, ఒక మైనర్‌ను (CCL) అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ నవంబర్ 2, 3 తేదీల్లో సికింద్రాబాద్ పరిధిలోని పరేడ్‌గ్రౌండ్స్, క్లాక్‌టవర్ ప్రాంతాల్లో రాత్రివేళ ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను దాడి చేసి, కత్తితో బెదిరించి నగదు, గడియారం, మొబైల్ ద్వారా డబ్బు బదిలీలు దోచుకున్నారు.
తదుపరి విచారణలో నిందితులు ముగ్ద్‌ఫోర్ట్, సిక్విల్లేజ్, పికెట్ ప్రాంతాలకు చెందినవారని, తరచూ బోవెన్‌పల్లి సెంట్రల్ వైన్ షాప్ వద్ద కలుసుకుని మద్యం సేవించి దోపిడీలకు పూనేవారని పోలీసులు తెలిపారు. నిందితులు వన్నం రాజేష్‌కు చెందిన ఆటో (TS13UD1633)ను ఉపయోగించి ఈ నేరాలను అంజామిచారు.
అరెస్ట్ అయిన నిందితులు:
1. వన్నం రాజేష్ (18) – ఆటో డ్రైవర్
2. బోయ నరసింహ (18) – జీహెచ్‌ఎంసీ వర్కర్
3. బూర్వతి కార్తిక్ (18) – కూలీ
4. పర్షురామ్ (20) – కూలీ (కత్తి స్వాధీనం)
5. ఒక మైనర్ (CCL)
తప్పించుకున్న నిందితుడు: శివ, ముగ్ద్‌ఫోర్ట్, సికింద్రాబాద్
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
రూ.5,500 నగదు
నేరాల్లో ఉపయోగించిన ఆటో TS13UD1633
రెండు మొబైల్ ఫోన్లు
కత్తి (పర్షురామ్ వద్ద)
నకిల్ డస్టర్ (నరసింహ వద్ద)
పౌరులు రాత్రివేళ ఒంటరిగా లేదా వెలుతురు లేని ప్రాంతాల్లో తిరగకుండా జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద కదలికలను వెంటనే డయల్ 100 లేదా 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని బేగంపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News
లక్ష్మీదేవిపేటలో ఘనంగా మీసేవ అవతరణ దినోత్సవం
లక్ష్మీదేవిపేటలో ఘనంగా మీసేవ అవతరణ దినోత్సవం
బిబిఎంఎం న్యూస్
వెంకటాపూర్, నవంబర్ 4:
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో మంగళవారం మీసేవ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ మీసేవ వి.ఎల్.ఈ చిలుక తిరుపతి ఆధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా మీసేవ ద్వారా లబ్ధి పొందిన ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
తిరుపతి మాట్లాడుతూ, 2011 నవంబర్ 4న మీసేవ ప్రారంభమై ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా, పారదర్శకంగా అందిస్తున్నదని పేర్కొన్నారు. లక్ష్మీదేవిపేట పరిధిలోని ప్రతి గ్రామ ప్రజలు మీసేవ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మీసేవ లబ్ధిదారులు చిర్ర గణేష్, వరికోల్ రమేష్, దేనబోయిన శంకర్, కడివండి తిరుపతి, గుగులోతు వాగ్య, మేక రమేష్ తదితరులు పాల్గొన్నారు.
-
Police News5 days agoకమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞల కొనసాగింపు : సీపీ అంబర్ కిషోర్ ఝా
-
diwali3 weeks ago🪔✨ దీపావళి శుభాకాంక్షలు — BBMA News నుండి మీకు మనస్ఫూర్తిగా! ✨🪔
-
Andrapradhesh5 days ago20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు
-
Andrapradhesh1 week agoతుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతం
-
india3 weeks agoజాతీయ పోలీస్ స్మారక దినోత్సవం: దేశ భద్రతకు ప్రాణాలు అర్పించిన వీరులకు నివాళి
-
Police News1 week agoపోలీసు అమరవీరుల దినోత్సవం
-
Telangana1 week ago
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
-
Telangana1 week ago
రాష్ట్రీయ ఏకతా దివస్” కార్యక్రమం పై చర్చ : ఎంపీ ఈటెల
