Telangana
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్
బిబిఎంఏ పోలీస్ న్యూస్ / జగిత్యాల:
జగిత్యాల జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రక్తదానం చేయడం ద్వారా మనం ప్రాణదాతలుగా మారతాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం శరీరానికి ఆరోగ్యదాయకం మాత్రమే కాక సమాజానికి ఉపయుక్తం కూడా అవుతుంది,” అని తెలిపారు.

రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, వివిధ సర్కిళ్ల సి.ఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సుమారు 200 యూనిట్ల రక్తం సేకరించబడిందని రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి. ప్రతి సంవత్సరం వారి సంస్మరణలో భాగంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా గౌరవకార్యం,” అని పేర్కొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిరిసిల్ల శ్రీనివాస్, డాక్టర్ దీపిక, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సైదులు, వేణు, సి.ఐలు రామ్ నరసింహ రెడ్డి, రవి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ అశోక్ కుమార్ చివరగా మాట్లాడుతూ, “రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే. ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో భాగమవ్వాలి,” అని పిలుపునిచ్చారు.
Telangana
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ అంగన్వాడి కేంద్రంలో “శుక్రవారం సభ” జరిగింది.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్సందర్భంగా వారు దేశాయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పిల్లల పోషణ, ఆరోగ్యంపై పూర్తి అవగాహన వస్తోందని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రతి మహిళ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు లభిస్తాయని తెలిపారు.
Telangana
హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ పర్యటనలో రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు, అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి గారు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో సమాచార హక్కు దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు.
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
Telangana
ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.
ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.
ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత *కీర్తి శేషులు అందేశ్రీ గారి* సంతాప సభ రేపు అనగా *22-11-2025 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు* హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో జరుగుతుంది.
గౌరవ మంత్రి వర్యులు
*శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో* జరిగే ఈ కార్యక్రమానికి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
*శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు* ముఖ్యఅతిది గా హాజరు అవుతారు.
రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, కవులు కళాకారులూ అందరూ విచ్చేయుచున్నారు.
కావున ఈ కార్యక్రమం లో పాల్గొని ఆ మహాకవి కి నివాళి అర్పిచడం తో పాటు మన ఐక్యత చాటగలరని కోరుతున్నాం.
*తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిTMRPS*
*తెలంగాణ రాష్ట్ర కమిటీ*
-
News2 weeks agoరూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్ మోటపలుకుల వెంకట్ పై కేసు
-
Telangana4 weeks agoరాష్ట్రస్థాయి గౌరవం అందుకున్న కవి శ్రీపతి రాము
-
Police News1 week ago🚨 BBMA POLICE e:NEWS – మా రిపోర్టర్లు & సహచర మీడియా జోలికి వస్తే తాట తీస్తాం
-
Telangana4 weeks agoమంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి
-
Police News2 weeks agoBBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు
-
Telangana4 weeks agoఘనంగా రిమ్ జిమ్ కిడ్స్ స్కూల్ వార్షికోత్సవం
-
Telangana4 weeks agoఉప్పల్లో హత్య కేసు ఛేదన… 6 గంటల్లో ఇద్దరు నిందితులు అరెస్ట్
-
india3 weeks agoమార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
